భారతీయ జనతాపార్టీలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ భజన ఎక్కువ అయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి రేకులు రాలిన కమలంగా ఆయన అభివర్ణించారు. 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏ ఒక్కపార్టీకి మెజార్టీ రాదని ఆయన జోస్యం చెప్పారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు రాజకీయంగా ఎదగడానికే రాష్ట్ర విభజన వైపు మొగ్గు చుపుతున్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు సమైక్యాంధ్ర కోసం సీఎం పదవినే తృణ ప్రాయంగా విడిచిపెట్టిన మహానీయుడని తులసీ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.