నంద్యాల టీడీపీలో కలకలం | lawyer tulasi reddy attacked by unknown persons | Sakshi
Sakshi News home page

నంద్యాల టీడీపీలో కలకలం

Published Tue, Mar 29 2016 9:51 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

నంద్యాల టీడీపీలో కలకలం - Sakshi

నంద్యాల టీడీపీలో కలకలం

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో కలకలం మొదలైంది. స్థానిక టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, న్యాయవాది తులసిరెడ్డిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఆయన్ని దుండగులు అడ్డగించి.... కళ్లలో కారం కొట్టి.... కత్తులతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. తీవ్ర గాయాలతో తులసిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... తులసిరెడ్డి.. పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో అతడిని హైదరాబాద్కు తరలించారు. అయితే ఈ దాడి చేసింది... ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరులే ఈ దాడి చేశారని.... తులసిరెడ్డి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement