కాంగ్రెస్‌కు పరాభవమే | Disastrous defeat Congress Party 2014 elections Tulasi Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పరాభవమే

Jan 19 2014 1:54 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకుని ఘోర తప్పిదం చేసిందని, ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని 20 సూత్రాల అమలు

భీమవరం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకుని ఘోర తప్పిదం చేసిందని,  ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎన్.తులసిరెడ్డి స్పష్టం చేశారు. భీమవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అసెంబ్లీలో అడ్డుకుంటామన్నారు. విభజన బిల్లు శాసనసభలో వీగిపోతే రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్రలో ఇంతగా ప్రజావ్యతిరేకత వస్తుందనే విషయూన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అధినేత సోనియాగాంధీ ఊహించలేకపోయూరని అన్నారు. 
 
 రాష్ట్ర విభజనకు శ్రీకా రం చుట్టి కాంగ్రెస్ పెద్ద తప్పు చేశారన్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి చవిచూసినట్టే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజా వ్యతిరేకత తప్పదన్నా రు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు తమ తెలుసుకుని విభజన నిర్ణయూన్ని విరమించుకోవాలని కోరారు. ఒకప్పుడు సమైక్యవాదులైన కేసీఆర్, జైపాల్‌రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని చెప్పారు.
 
 20 సూత్రాల అమలులో మనమే టాప్
 20 సూత్రాల కార్యక్రమం అమలులో వరుసగా మూడుసార్లు జాతీయస్థాయి పురస్కారాన్ని మన రాష్ట్రం దక్కించుకుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 సూత్రాల కార్యక్రమం అమలుకు రూ.14వేల 154 కోట్లను కేటాయించినట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement