సాక్షి, విజయవాడ: విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయాల్సి ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. 2018 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని విమర్శించారు. పోలవరం విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ పూర్తి అవాస్తవాలని కొట్టి పారేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలన్నారు.
మూడున్నర ఏళ్లలో కేంద్రం నుంచి రూ. 4,329 కోట్లు మాత్రమే పోలవరం నిర్మాణానికి విడుదలయ్యాయని, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు సర్కారు ఖర్చు చేసింది రూ. 7,431 కోట్లు అని, అందులో కేంద్రం రూ.3,102 కోట్లు ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం ఎలా పూర్తి అవుతుంది అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment