జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దళితులకే దక్కనుంది. జిల్లా పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కమిషనర్ శనివారం ప్రకటించారు.
సాక్షి, కడప : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దళితులకే దక్కనుంది. జిల్లా పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను పంచాయతీరాజ్ కమిషనర్ శనివారం ప్రకటించారు. ఇంతవరకు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి ఓసీ, బీసీలను మాత్రమే వరించింది.
తొలిసారిగా దళితులకు దక్కనుండటం గమనార్హం. గతంలో జెడ్పీ అధ్యక్షులుగా తులసిరెడ్డి (జనరల్) కె.సురేష్‌బాబు(బీసి), జ్యోతిరెడ్డి (ఓసి మహిళ) పనిచేసి ఉన్నారు.