
వేంపల్లె: రాష్ట్రానికి, ప్రజలకు సీఎం చంద్రబాబు ఒక శనిలాంటి వారని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాలోల గెలుస్తామంటూ బాబు పగటి కలలు కనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలంటే హోదా రావాలన్నారు. సీమకు, ఉత్తరాంధ్రకు అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు రావాలన్నారు.