PCC Vice Presidents
-
ఓటర్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించొద్దు: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించే ప్రక్రియను నిలిపివేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు టి.నిరంజన్ డిమాండ్ చేశారు. అనుసంధానం కోసం ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల సమాచారాన్ని కుల, మత, ప్రాంతాల వారీగా విభజించే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇంతవరకు సేకరించిన ఆధార్ సమాచారాన్ని కూడా ఉపయోగించకుండా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: చార్మినార్‌లో గెలిచి చూపిస్తా: రఘునందన్‌రావు -
రాష్ట్రానికి శని చంద్రబాబు: తులసిరెడ్డి
వేంపల్లె: రాష్ట్రానికి, ప్రజలకు సీఎం చంద్రబాబు ఒక శనిలాంటి వారని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాలోల గెలుస్తామంటూ బాబు పగటి కలలు కనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలంటే హోదా రావాలన్నారు. సీమకు, ఉత్తరాంధ్రకు అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు రావాలన్నారు. -
పీసీసీ ఉపాధ్యక్షులుగా కమలమ్మ
సాక్షి, అమరావతి: కేంద్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు పి.ఎం.కమలమ్మను పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె కృషి ఎనలేనిదన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన కమలమ్మ విజయవాడలో రఘువీరారెడ్డిని కలిశారు.