సాక్షి, అమరావతి: కేంద్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు పి.ఎం.కమలమ్మను పీసీసీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె కృషి ఎనలేనిదన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన కమలమ్మ విజయవాడలో రఘువీరారెడ్డిని కలిశారు.