
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించే ప్రక్రియను నిలిపివేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు టి.నిరంజన్ డిమాండ్ చేశారు. అనుసంధానం కోసం ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ల సమాచారాన్ని కుల, మత, ప్రాంతాల వారీగా విభజించే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇంతవరకు సేకరించిన ఆధార్ సమాచారాన్ని కూడా ఉపయోగించకుండా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: చార్మినార్‌లో గెలిచి చూపిస్తా: రఘునందన్‌రావు