కర్నూలు : నంద్యాల టీడీపీ నేత తులసిరెడ్డిపై దాడి కేసులో నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ఎ.రవికృష్ణ వెల్లడించారు. ఈ కేసులో కొత్తపల్లి బాలవెంకట్రెడ్డి సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగిన ఘటన స్థలాన్ని మంగళవారం రవికృష్ణ పరిశీలించారు. ఈ కేసులో నిందితులెవరైనా వదిలి పెట్టమని... కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
నంద్యాల టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన తులసిరెడ్డిపై సోమవారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. తులసిరెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొత్తపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.