సాక్షి, కర్నూలు: జిల్లాలో ఎర్రచందనం, ఫ్యాక్షన్ వంటివి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చాయని జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప అన్నారు. నేరాల నియంత్రణలో జిల్లాకు నాలుగో స్థానం దక్కిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా పలు నేరాలను గుర్తించామన్నారు. రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్నామని పేర్కొన్నారు.
ఇక స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ మద్యం, డీజే డ్యాన్సులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment