kurnool sp
-
ప్రాజెక్టుల వద్ద ఎవరూ గుమికూడరాదు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు : జిల్లాలోని శ్రీశైలం, పోతిరెడ్డిపాడు,హెడ్ రెగ్యులేటర్, రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్కడ ఎవరూ గుమికూడరాదని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతలో భాగంగా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు. మహబూబ్‌నగర్ జూరాల ప్రాజెక్ట్ వంతెనపై తెలంగాణ పోలీసులు రాకపోకలు నిషేధించారు. తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అత్యవసరమైతేనే తప్ప అనుమతించటం లేదు. గద్వాల, ఆత్మకూరు, మక్తల్ మధ్య రాకపోకలు బందయ్యాయి. -
చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, కర్నూలు: చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు ఎన్440కే వైరస్ ఉందని దుష్ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కొత్త స్ట్రెయిన్ వైరస్ లేదని శాస్త్రవేత్తలే చెబుతున్నారని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ కేసు ధైర్యం చెప్పకుండా దుష్ప్రచారమా? -
ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
-
‘కర్నూలులో ఫ్యాక్షన్ నియంత్రణలోకి వచ్చింది’
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఎర్రచందనం, ఫ్యాక్షన్ వంటివి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చాయని జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప అన్నారు. నేరాల నియంత్రణలో జిల్లాకు నాలుగో స్థానం దక్కిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా పలు నేరాలను గుర్తించామన్నారు. రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇక స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ మద్యం, డీజే డ్యాన్సులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇసుక తరలిస్తే ఖబడ్దార్
సాక్షి, కర్నూలు: ప్రభుత్వం తాత్కాలికంగా ఇసుక తరలింపును నిలిపివేసిందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. బుధవారం ఆయన వెల్దుర్తి , కృష్ణగిరి పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్ఐలు పులిశేఖర్, విజయభాస్కర్‌లకు సూచించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. అసాంఘిక చర్యలు అరికట్టేందుకు తన ఆధ్వర్యంలో క్రైం పార్టీని ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగినా ప్రజలు తమకు సమాచారం ఇస్తే, క్రైం పార్టీ ఆధ్వర్యంలో వెంటనే చర్యలకు దిగుతామన్నారు. వెల్దుర్తి హైవేలో గత నెల జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని, బాధితులకు నష్టపరిహారం అందేలా జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికలు ప్రభుత్వానికి పంపామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రయాణికులకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన పోలీసులను బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. భార్య, భర్తలిద్దరూ ఉద్యోగులైతే మెడికల్ గ్రౌండ్ కింద వారికి మరో అవకాశమివ్వనున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు ఎస్పీ తెలిపారు. బాధితులమైన తమపైనే కేసు బనాయించారని గత నెల 23న చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుడు మంగంపల్లె హరిచంద్రుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. మరమ్మతులు, నిర్మాణాలకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయన వెంట డోన్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఉన్నారు. -
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
-
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. నారాయణ రెడ్డి హత్యకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రిందిస్థాయి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా పోలీసు గస్తీని పెంచామని అయినా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కాగా, నారాయణరెడ్డిని కిరాతకంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, ఆయన తగిన రక్షణ కల్పించకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించివుంటే ఈ దారుణం జరిగివుండేది కాదని అంటున్నారు. -
ఎస్పీ వద్ద మనసులో మాట చెప్పిన హిజ్రా
సారూ.. ఎస్ఐ కావాలనుంది..! - ఎస్పీ రవికృష్ణను కోరిన హిజ్రా మాధురి నంద్యాల: ‘సారూ.. నాకు ఎస్ఐ కావాలనుంది, సాయం చేయండి’ అని మాధురి అనే హీజ్రా జిల్లా ఎస్పీ రవికృష్ణను కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎస్ఐ సెలక్షన్లకు కోచింగ్ ఇప్పిస్తానని, పుస్తకాలు అందజేస్తానని చెప్పారు. నేత్రదానం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బుధవారం నంద్యాలలోని మహానంది రస్తా పాత కేసీ కెనాల్ భవన సముదాయంలో ఉన్న సమతా హిజ్రాల సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నందికొట్కూరు తాలూకా విపనగండ్ల గ్రామానికి చెందిన తాను డిగ్రీ వరకు చదివానని చెప్పారు. తర్వాత ఎంకాం చేయడంకోసం ఆర్యూ పీజీ సెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకున్నా హిజ్రా అనే కారణంతో సీటు నిరాకరించారంటూ కన్నీరు పెట్టుకుంది. విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ ఏడాది మేలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షకు హాజరైనట్లు చెప్పింది. హిజ్రాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నష్టపోతున్నట్లు చెప్పింది. తమిళనాడులో ఓ హిజ్రా ఎస్ఐ పోస్టుకు ఎంపికైందని, తాను కూడా అలా కావాలని చెప్పింది. దీనిపై ఎస్పీ రవికృష్ణ స్పందిస్తూ తమిళనాడులో హిజ్రా.. మహిళల కోటాలో ఎస్ఐ పోస్టు సాధించినట్లు చెప్పారు. ఎస్ఐ సెలక్షన్‌కు హాజరు కావడానికి సాయం చేస్తానని, మెటీరియల్ అందిస్తామని హామీ ఇచ్చారు. -
కె బి వెంకట్‌రెడ్డి సహా 8 మందిపై కేసు నమోదు
కర్నూలు : నంద్యాల టీడీపీ నేత తులసిరెడ్డిపై దాడి కేసులో నిందితులను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ఎ.రవికృష్ణ వెల్లడించారు. ఈ కేసులో కొత్తపల్లి బాలవెంకట్‌రెడ్డి సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగిన ఘటన స్థలాన్ని మంగళవారం రవికృష్ణ పరిశీలించారు. ఈ కేసులో నిందితులెవరైనా వదిలి పెట్టమని... కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. నంద్యాల టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన తులసిరెడ్డిపై సోమవారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. తులసిరెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొత్తపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. -
ఇదెక్కడి న్యాయం చంద్రబాబూ: భూమా
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఒకే చట్టాన్ని ఒకే రాష్ట్రంలో ఒక్కో తీరుగా అమలు చేయడం ఎంతరకూ సమంజసమని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అణగదొక్కడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారన్నారు. అదే తన విషయానికొచ్చే సరికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎలా అరెస్టు చేయించారని అన్నారు. ఏసీబీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఏపీలో వైద్య చికిత్సలు చేయించుకోవడానికి అనుమతిచ్చిన చంద్రబాబు.. తనకు మాత్రం హైదరాబాద్‌లో చికిత్సలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. ఎస్పీ నంద్యాలకు వస్తే స్వాగతిస్తా.. జిల్లా ఎస్పీ నంద్యాలకు అధికారిగా వచ్చి ప్రజలకు న్యాయం చేస్తానంటే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాను గాని, తన అనుచరులు గానీ నంద్యాలలో ఎక్కడా అరాచకాలు, అన్యాయాలు చేయడం లేదని.. అందు వల్ల ఎలాంటి అధికారి వచ్చినా భయపడమన్నారు.ఎస్పీకి ప్రస్తుతం సీఎం నుంచి మంచి మార్కులు వచ్చి ఉండొచ్చని, అందువల్ల ఆయన జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా స్వాగతిస్తానన్నారు. -
కర్నూలు ఎస్పీపై భూమా మండిపాటు!
-
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే కర్నూలు జిల్లా ఎస్పీ.. వైఎస్ఆర్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలు పెంచుకునే బదులు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని భూమా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించిందని, అలాంటపుడు ఈసీ అనుమతి లేకుండా తనను ఎలా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని భూమా చెప్పారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో భూమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. -
'నంద్యాలలోనే కాపురం ఉంటా'
కర్నూలు: నంద్యాలలో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ఎదుర్కోవడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని, అవసరమైతే తాను నంద్యాలలోనే కాపురం ఉంటూ మరింత కఠినంగా వ్యవహరిస్తానని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. గురువారం ఆయన అడిషనల్ ఎస్పీ శివకోటి బాబూరావు, డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్, దేవదానం, బాబుప్రసాద్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రోజు నంద్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రవర్తించిన తీరు పోలీసుల ఆత్మగౌరవం కించపరిచేలా ఉందన్నారు. డీఎస్పీ దేవదానంను ఉద్దేశించి డోన్ట్ టచ్ మీ... అని అగౌరవపరచినందుకే ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ వినోద్‌కుమార్ చేత దర్యాప్తు చేసి వివరాలను కోర్టుకు సమర్పించామని.. దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించాయన్నారు. డీఎస్పీ దేవదానం మాట్లాడుతూ 2001 నుంచి 2004 వరకు తాను ఆళ్లగడ్డలో పనిచేశానని, తన పూర్వాపరాలు ఎమ్మెల్యేకు తెలుసునన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న తాను ఆళ్లగడ్డ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఓటు వేసి వెళ్లండని చెబితే ఆ విషయాన్ని మరో విధంగా అర్థం చేసుకుని భూమా తనపై మండిపడుతూ డోన్ట్ టచ్ మీ అన్నారన్నారు. అగ్రవర్ణాలకు చెందిన మరో డీఎస్పీ పక్కనే ఉన్నప్పటికీ తనను మాత్రమే ఉద్దేశించి ఇలా మాట్లాడటం బాధించిందన్నారు. -
విఐపి రిపోర్టర్ - కర్నూలు ఎస్పీ రవికృష్ణ
-
'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా'
హైదరాబాద్: భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు. కర్నూలు ఎస్పీకి కనీస విచక్షణ లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎమ్మెల్యేపై రౌడీషీట్ తెరుస్తారా అని నిలదీశారు. ఏ సందర్భంలో రౌడీషీట్ తెరుస్తారో చదువుకున్నారా అని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు.