'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా' | tdp government depressed opposition, says mv mysura reddy | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా'

Published Thu, Nov 6 2014 4:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా'

'ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా'

హైదరాబాద్: భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఇదంతా చేస్తున్నారని అన్నారు.

కర్నూలు ఎస్పీకి కనీస విచక్షణ లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా ఎమ్మెల్యేపై రౌడీషీట్ తెరుస్తారా అని నిలదీశారు. ఏ సందర్భంలో రౌడీషీట్ తెరుస్తారో చదువుకున్నారా అని ప్రశ్నించారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement