విజయనగరం టౌన్: వరుస నేరాలకు పాల్పడే వారిని గుర్తించి, వారిపై హిస్టరీ షీట్‌లు తప్పనిసరిగా తెరిచి, నిరంతర నిఘాను ఉంచాలని ఎస్పీ జి.పాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలుమార్లు నేరాలకు పాల్పడే వారికి స్టేషన్ బెయిల్‌ను మంజూరు చేయవద్దన్నారు. వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపైన, బెల్టుషాపులు ద్వారా మద్యం విక్రయాలు చేపట్టే వారిపైనా, నిషేధిత ఖైనీ, గుట్కాలు విక్రయదారులు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, మద్యం సేవించి బహిరంగ ప్రాంతంలో వీరంగం చేసే వారిపైనా, గంజాయి అక్రమ రవాణాదారులపైనా దాడులు ఉధృతం చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.
తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే సాంకేతికత జిల్లా పోలీసు శాఖకు త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్లు, ఈ పరిజ్ఞానంతో కేసుల మిస్టరీని చేధించవచ్చన్నారు. అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పరశురామ్, బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీలు టి.త్రినాథ్, గురుమూర్తి, సీసీఎస్ డీఎస్పీ ఎఎస్.చక్రవర్తి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, మహిళా పీఎస్ డీఎస్పీ కుమారస్వామి, డీటీసీ డీఎస్పీ సిహెచ్‌వి.ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ ఎ.హనుమంతు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బివిజె.రాజు, డీసీఆర్‌బీ సీఐ రఘు శ్రీనివాస్, లీగల్ అడ్వయిజర్ జానకి రామరావు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నేరాలకు పాల్పడే వారిపై కన్నేయండి : ఎస్పీ
Published Wed, Aug 30 2017 10:12 PM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM
Advertisement
Advertisement