విజయనగరం టౌన్: విధి నిర్వహణలో బిజీగా ఉండే జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ పుట్టినరోజు నిర్వహించుకునే పోలీసులకు ఆ రోజు వారి కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా గడిపేందుకు అవకాశం కల్పిస్తూ చర్యలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. సుమారు 2వేల మంది పోలీసులు వివిధ హోదాల్లో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
విధి నిర్వహణలో భాగంగా తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్లడం, సమయపాలన లేకుండా విధులు నిర్వహించడం, కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా గడిపే సమయాలు తక్కువగా మాట్లాడడం, కుటుంబంలో జరిగే కొన్ని శుభ కార్యాక్రమాలకు కూడా హాజరుకాని పరిస్థితులు తరచూ ఎదరవుతూనే ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది పుట్టిన రోజున ఉదయం వారికి స్వయంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, వారి కుటుంబంతో స్వేచ్ఛగా గడిపేందుకు పర్మిషన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా , ప్రతీ రోజూ నిర్వహించే ‘ప్రతిదినం– ప్రబోధం’ కార్యక్రమం తర్వాత నేరుగా సంబంధిత సిబ్బంది పేర్లను ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పిలిచి, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి, వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు జన్మదినం రోజున పర్మిషన్ మంజూరు చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment