no dj
-
‘కర్నూలులో ఫ్యాక్షన్ నియంత్రణలోకి వచ్చింది’
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఎర్రచందనం, ఫ్యాక్షన్ వంటివి పూర్తి స్థాయిలో నియంత్రణలోకి వచ్చాయని జిల్లా ఎస్పీ డా. ఫక్కీరప్ప అన్నారు. నేరాల నియంత్రణలో జిల్లాకు నాలుగో స్థానం దక్కిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా పలు నేరాలను గుర్తించామన్నారు. రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇక స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ మద్యం, డీజే డ్యాన్సులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
17నిమిషాల ఆడియోతో కానిచ్చేశారు
మోరెనా(మధ్యప్రదేశ్): పెళ్లిళ్ల అనవసర ఖర్చులను నియంత్రించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానున్న నేపథ్యంలో తక్కువ ఖర్చులు, హంగులు ఆర్భాటాలకు పోకుండా వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ జంట పెద్దగా ఆడంబరాలకు పోకుండా కేవలం 17 నిమిషాల వ్యవధితో ఉన్న మంత్రాల ఆడియో సహాయంతో పెళ్లితంతును కానిచ్చేశారు. 200మంది ఆహ్వానితుల మధ్య మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమం జరిపించేందుకు పంతులును కూడా పిలిపించలేదు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని మోరెనా ప్రాంతంలో జారా అనే గ్రామానికి చెందిన వధువుకు బ్రిజేశ్ దాస్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. అయితే, తొలుత భారీగా వీరి వివాహం జరిపించాలని భావించుకున్నప్పటికీ అనవసరపు వ్యయం అవసరమా అని భావించిన వారు రాంపాల్ మహారాజ్ అనే సెయింట్ మాట విని సాధారణ వివాహానికి అంగీకరించారు. ఇరు వర్గాల అంగీకారంతో కనీసం డీజే, అలంకరణ కూడా లేకుండా మాములుగా వివాహం చేసుకున్నారు. 17నిమిషాల మంత్రాల ఆడియో అయిపోగానే వివాహం అయిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇతర వివాహాల్లో మాదిరిగానే బంధువులకు విందుభోజనాలు వడ్డించి పంపించారు.