తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య | annamayaya very great | Sakshi
Sakshi News home page

తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య

Jul 25 2016 12:18 AM | Updated on Sep 4 2017 6:04 AM

తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ తులసిరెడ్డి అన్నారు. దిలీప్‌కుమార్‌ కల్చరల్‌ ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన కచేరీ జరిగింది.

విజయవాడ కల్చరల్‌ : 
తెలుగు వెలుగు సూర్యుడు అన్నమయ్య అని పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ తులసిరెడ్డి అన్నారు. దిలీప్‌కుమార్‌ కల్చరల్‌ ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన కచేరీ జరిగింది. ముఖ్య అతిథి తులసిరెడ్డి మాట్లాడుతూ పద కవితకు అన్నమయ్య ఆద్యుడని, ఆయన సాహిత్యం నిండా సామాజిక స్పృహ నిండి ఉంటుందని చెప్పారు. జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి గురుంచి మాట్లాడుతూ 179 పుస్తకాలకు పైగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పవర్‌ ఆఫ్‌ ఆస్ట్రో న్యూమరాలజీ  గ్రంథాన్ని రచించారని, జ్యోతిష్య అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యువ జ్యోతిష్య శాస్త్రవేత్త వంశీకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కిషోర్‌ తదితరులు మాట్లాడారు. భక్తి సంగీత విభావరి కార్యక్రమంలో భాగంగా గాయకుడు దిలీప్‌కుమార్‌  స్వరపరిచిన సంకీర్తనలను గాయనీమణులు టీవీఎస్‌ శ్రీదేవి, జ్యోతి, కొమ్మినేని రత్నకుమారి ఆలపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement