ఉండవల్లి, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు | severe response to undavalli arun kumar jai andhra pradesh summit | Sakshi
Sakshi News home page

ఉండవల్లి, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు

Published Sun, Aug 4 2013 8:50 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

severe response to undavalli arun kumar jai andhra pradesh summit

రాజమండ్రి: జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యతిరేకంగా సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు.  జై ఆంధ్రప్రదేశ్ సదస్సులో భాగంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో సమైక్య వాదులు గందర గోళ సృష్టించారు. సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను పెట్టాలని ఆందోళన కారులు నిరసనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. జై సమైక్యాంధ్రా నినాదంతో ఆ ప్రాంతమంతా హోరుత్తెంది. ఈ సదస్సులో సమైక్యాంధ్రా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు.

 

సమైక్యాంధ్రా కోరుతూ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి.  ఐదు రోజులుగా చేస్తున్న సమైక్యాంధ్ర హోరు ఉధృతమైంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement