రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కర్నూలు జాతీయ రహదారిని గురువారం న్యాయవాదులు దిగ్బంధం చేశారు.
కర్నూలు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కర్నూలు జాతీయ రహదారిని గురువారం న్యాయవాదులు దిగ్బంధం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల జేఏసి తుంగభద్ర బ్రిడ్జ్‌పై ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప... సమైక్యాంధ్ర ఉద్యమం కోసంకాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనకపోతే సీమాంధ్రలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. మూడు ప్రాంతాల భవిష్యత్ కోసం ప్రజా ఉద్యమం ఉధృతమైందని...కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా స్పందించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.