lawyers protest
-
హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూల్ లాయర్ల ఆందోళన
-
కర్నూలులో నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
-
కోర్టు వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు నిరనస సెగ
కొల్కతా: కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది పి.చిదంబరంకు నిరసన సెగ తగిలింది. కొల్కతాలో సొంతపార్టీకి చెందిన లాయర్లు చిదంబరంను అడ్డుకున్నారు. మెట్రో డైరీ అవినీతి కేసు విచారణ కోసం కొల్కతా హైకోర్టుకు వచ్చిన చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ఓ బ్రోకర్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, మెట్రో డైరీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సొంతపార్టీకి వ్యతిరేకంగా కేసుకు ఒప్పుకున్న చిదంబరంపై కాంగ్రెస్ లాయర్లు మండిపడ్డారు. చదవండి: (కస్టడిలో వ్యక్తి మృతి.. రాత్రి సమయంలో విచారణ చేయొద్దు.. -
తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇప్పటికే ఈ విషయంలో రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ముగ్గురు తెలంగాణ న్యాయమూర్తులను ఇప్పటికే బదిలీ చేశారని, త్వరలో మరికొందరిని బదిలీ చేసేందుకు సర్వం సిద్ధమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని బదిలీలు చేపట్టబోతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ బదిలీ యత్నాల వెనుక ఇటీవల తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఓ న్యాయమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సర్వం తానై వ్యవహరిస్తున్న ఆ న్యాయమూర్తి ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని వాడుతున్నట్టు చెబుతున్నారు. ఆ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం ఓ లేఖను పంపింది. ఊరుకునేది లేదు రాష్ట్ర న్యాయమూర్తులను బలి పశువులను చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. ఇందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం సిద్ధమంటున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులు బుధవారం హైకోర్టులో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు గేటు ముందు ‘సేవ్ తెలంగాణ జ్యడీషియరీ, ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం ఆపాలి’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంతో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి చెప్పారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని, రాష్ట్ర న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని ప్రశ్నించడమేనని మరో న్యాయవాది చిన్నోళ్ల నరేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకురావాలన్న ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళనలు ఉద్యమ రూపం దాలుస్తాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, చిక్కుడు ప్రభాకర్, ఎ. జగన్, రాజేశ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు
సాక్షి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు నగరంలో పర్యటించిన చంద్రబాబుకు స్థానిక న్యాయవాదులు చుక్కలు చూపించారు. పెద్ద మార్కెట్ వద్ద జరగిన రోడ్డు షోలో పాల్గొన్న చంద్రబాబును న్యాయవాదులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైకోర్టు కర్నూలుకు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని నిరసన స్వరాలు వినిపించిన న్యాయవాదులు.. చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని, తోపులాటకు దారి తీసింది. హైకోర్టు విషయంలో చంద్రబాబు వైఖరిపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హైకోర్టుకు మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు. -
జీవో86 రద్దు చేయాలని న్యాయవాదుల నిరసన
-
భీమా-కోరేగావ్ కేసు: విజయవాడలో లాయర్ల ఆందోళన
-
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఏపీఅసెంబ్లీ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే న్యాయవాదుల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
చంద్రబాబు ఒక నియంత.. టీడీపీ నేతలు దద్దమ్మలు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన రాయలసీమకు న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులను, వారి ఉద్యమాలను అణచడానికి ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. రాయలసీమకు చెందిన తెలుగుదేశం ప్రజాపతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని న్యాయవాద సంఘం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నా, పట్టించుకోవట్లేదని విమర్శించారు. దీనికి త్వరలోనే తగిన ఫలితం అనుభవిస్తారని న్యాయవాద సంఘం నేతలు హరినాథరరెడ్డి, రామ్‌కుమార్, రాజారెడ్డి అన్నారు బాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు : ఆంధ్రపద్రేశ్ ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. ఏయే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందో కూడ సీఎంకు తెలియకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలౌతోందని తెలియచేశారు. ఏరాష్ట్రంలోనైనా హోదాను చట్టంలో పెట్టినట్లు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. -
హైకోర్టులో న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: హైకోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్-2017 ను రద్దు చేయాలని కోరారు. న్యాయవాదులు సమ్మెలు చేస్తే రూ.3 లక్షలు పెనాల్టీ విధించడం అన్యాయమన్నారు. విధులు బహిష్కరిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించటం సిగ్గుచేటని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రంగారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం న్యాయవాదులు ఆందోళనకు దిగారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమండ్ చేస్తున్న అడ్వకేట్ అమెన్మెంట్ యాక్ట్ 2017 ను పార్లమెంట్ లో ఆమోదం పొందకుండా చూడలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి తమ నిరసన తెలిపారు. -
ప్రత్యేక హోదా కోసం లాయర్ల ధర్నా
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో న్యాయవాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజమండ్రి బార్ అసోసియేషన్, కోస్తా రీజియన్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ధర్నాకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవశ్యకతపై నాయవాద సంఘాల నేతలు ముప్పాళ్ల సుబ్బారావు, హనుమంతరావు తదితరులు ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించి ఎన్నికల హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేడు న్యాయవాదుల నిరసన
హైకోర్టు సహా అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణ హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు. ఈనెల 5న హైకోర్టుతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదును ఏపీ బార్ కౌన్సిల్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనపై న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదులో అసభ్యకరమైన, తీవ్ర అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని ఆరోపించారు. ఈ వివాదానికి కారణమైన రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఇద్దరు, వరంగల్ కోర్టులోని ముగ్గురు న్యాయవాదులను వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్‌జాం
హైదరాబాద్: న్యాయవాదుల ఆందోళన కారణంగా ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో బుధవారం ఉదయం లాయర్లు రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు న్యాయవాదులను ఆందోళన విరమింపజేసేందుకు యత్నిస్తున్నారు. -
నాంపల్లిలో యుద్ధ వాతావరణం
హైదరాబాద్: న్యాయవాదుల రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంది. న్యాయవాదులను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో పోలీసులను మొహరిచడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కోర్టు ఎదుట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో.. తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. -
సివిల్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయమూర్తుల వాహనాలు లోపలికి వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హైకోర్టు కోరుతూ వారం రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. సంఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
అనంతపురం: లాయర్ ఫక్రుద్దీన్ అరెస్ట్‌కు నిరసనగా న్యాయవాదులు రోడ్డెక్కారు. అకారణంగా అరెస్ట్ చేసిన ఫక్రుద్దీన్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. న్యాయవాదులంతా కలిసి ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంత కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న ఫక్రుద్దీన్ బుధవారం రాత్రి గుంతకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు నిరిసనగా జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నారు. -
హైకోర్టు వద్ద లాయర్ల నిరసన
చార్మినార్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు ముందు నిరసనకు దిగారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని, ఆర్టికల్ 214 ను గౌరవించాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. -
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
-
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
విశాఖ : సెక్షన్-8పై విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులు తమ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు సెక్షన్-8 గుర్తుకొచ్చిందా అని వారు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులపైనా, న్యాయమూర్తులపైనా దాడి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదన్నారు. ఇప్పుడు వేదికపై ఉన్నవారంతా అప్పుడు ఎందుకు స్పందించలేదని న్యాయవాదులు సూటిగా ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు అంటే... విశాఖ ఎందుకు చర్చ పెట్టారని పలువురు న్యాయవాదులు నిలదీశారు. ప్రస్తుతం వేదికపై ఉన్నవారంతా సమైక్య ఉద్యమంలో తప్పుకున్నారని, తామే చివరివరకూ పోరాడమని, 200 రోజుల పాటు కోర్టుల్లో విధులకు హాజరు కాలేదని గుర్తు చేశారు. హైకోర్టులో అలజడి రేగినప్పుడు ఎందుకు స్పందించలేదని లాయర్లు ప్రశ్నించారు. కాగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహణలో 'ఇంప్లిమెంటేషన్ అండ్ అమెండ్మెంట్ టు సెక్షన్ 8 ఆఫ్ ఏపీ రీఆర్గనైజింగ్ యాక్ట్' అంశంపై హోటల్ దసపల్లాలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొన్నారు. -
ఐడీ కార్డు ఉంటేనే కోర్టులోకి అనుమతి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ముందు 144 సెక్షన్ అమలు అవుతోంది. ఐడీ కార్డులు ఉన్నవారినే కోర్టులోనికి అనుమతి ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయలంటూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లాయర్లపై దాడి చేశారు. దాంతో కోర్టు పరిసరాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు చార్మినార్ సిటీ సివిల్ కోర్టు వద్ద కూడా పోలీసులు మోహరించారు. మేజిస్ట్రేట్‌ను అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు భద్రతను పెంచారు. ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే కోర్టులోకి అనుమతించాలని సూచనలను పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా జంటనగరాల కమిషనరేట్ల పరిధిలో భద్రతను పెంచినట్లు సీపీ తెలిపారు. -
రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత
-
ఫోటో గ్యాలరీ: తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల నిరసన
హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అద్యక్షుడు సీవీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేవలం తమను అడ్డుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే వాళ్లు చలో హైకోర్టు కార్యక్రమం తలపెట్టారన్నారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులకు పూర్తిగా సహకరించారు. -
మహిళల పట్ల టి-లాయర్ల అసభ్యప్రవర్తన: మోహన్‌రెడ్డి
హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అద్యక్షుడు సీవీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేవలం తమను అడ్డుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే వాళ్లు చలో హైకోర్టు కార్యక్రమం తలపెట్టారన్నారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులకు పూర్తిగా సహకరించారని, తమ కార్యక్రమానికి ముందస్తు అనుమతి ఉన్నా కూడా కావాలనే తమను అరెస్టు చేశారని అన్నారు. తమను అడ్డుకునే క్రమంలో సీమాంధ్ర న్యాయవాదుల్లో ముగ్గురిని తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా గాయపరిచారని, మహిళా న్యాయవాదులని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వాళ్లు తమపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడే ఇలాంటి దాడులు జరుగుతుంటే.. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీమాంధ్రుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికను విజయవంతం చేస్తామని మోహన్‌రెడ్డి తెలిపారు. -
రహదారిని దిగ్బంధించిన న్యాయవాదులు
కర్నూలు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కర్నూలు జాతీయ రహదారిని గురువారం న్యాయవాదులు దిగ్బంధం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదుల జేఏసి తుంగభద్ర బ్రిడ్జ్‌పై ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప... సమైక్యాంధ్ర ఉద్యమం కోసంకాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనకపోతే సీమాంధ్రలో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. మూడు ప్రాంతాల భవిష్యత్ కోసం ప్రజా ఉద్యమం ఉధృతమైందని...కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా స్పందించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.