హైకోర్టు సహా అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణ
హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టు ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులివ్వడానికి నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్ణయించింది. జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో న్యాయవాదులు బుధవారం సమావేశమయ్యారు.
ఈనెల 5న హైకోర్టుతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదును ఏపీ బార్ కౌన్సిల్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనపై న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదులో అసభ్యకరమైన, తీవ్ర అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారని ఆరోపించారు. ఈ వివాదానికి కారణమైన రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఇద్దరు, వరంగల్ కోర్టులోని ముగ్గురు న్యాయవాదులను వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
నేడు న్యాయవాదుల నిరసన
Published Thu, Aug 4 2016 3:34 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
Advertisement
Advertisement