పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదుల ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయమూర్తుల వాహనాలు లోపలికి వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హైకోర్టు కోరుతూ వారం రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. సంఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.