Civil Court
-
సంజయ్ రాయ్ దోషే
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2024 ఆగస్ట్ 9న జరిగిన ఈ దారుణంపై నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. రాయ్‌పై భారతీయ న్యాయ సహిత సెక్షన్లు 64, 66తో పాటు మరణ శిక్ష, లేదా జీవిత ఖైదుకు వీలు కలి్పంచే 103(1) కింద కేసులు నమోదయ్యాయి. వాటిపై 2024 నవంబర్ 12 నుంచి సీల్డా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బణ్ దాస్ రెండు నెలలపాటు రహస్య విచారణ జరిపారు. రాయ్‌పై మోపిన అన్ని ఆరోపణలనూ సీబీఐ రుజువు చేసిందని పేర్కొన్నారు. వైద్యురాలిపై అతను లైంగిక దాడి చేయడమే గాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిందన్నారు. ‘‘తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆస్పత్రిలోకి చొరబడ్డావు. సెమినార్ హాల్లో నిద్రిస్తున్న ఆన్‌డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి, వాదనలు విన్న మీదట నువ్వే దోషివని నిర్ధారించా. నిన్ను శిక్షించాల్సిందే’’ అని నిందితున్ని ఉద్దేశించి జడ్జి పేర్కొన్నారు. కేసులో ఇరికించారు తనను ఈ కేసులో ఇరికించారని రాయ్ అన్నాడు. ‘‘నేనే గనుక ఈ నేరం చేసుంటే నా మెడలోని రుద్రాక్షమాల అక్కడే తెగిపోయి ఉండేది’’ అన్నాడు. ‘నన్నీ కేసులో ఇరికించిన వారిని ఎందుకు వదిలేశారు?’ అని ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌వోలను ఉద్దేశించి ప్రశ్నించాడు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు దోషి వాంగ్మూలం తీసుకుంటామని, అనంతరం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరిస్తానని జడ్జి తెలిపారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన పలు అంశాలకు కూడా అందులో బదులిస్తానని చెప్పారు. తర్వాత రాయ్‌ను పోలీసులు ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోంకు తీసుకెళ్లారు. అతడిని మీడియాతో మాట్లాడనివ్వలేదు. తీర్పును పాలక తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించగా ఇక పార్టీ ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తుదిశ్వాస వరకు పోరాడుతాం తీర్పు విన్నాక బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘మీపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారు’ అని జడ్జినుద్దేశించి పేర్కొన్నారు. తల్లి మాత్రం పూర్తి న్యాయం జరగలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కుమార్తెను చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకున్న రాయ్ విచారణ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. ఈ దారుణానికి అతడొక్కడే కారణం కాదు. ఇతర దోషులనూ చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు తుదిశ్వాస దాకా పోరాడతాం’’ అని చెప్పారు. కుట్ర తేలేదాకా పోరు: వైద్యులు పాక్షిక న్యాయమే జరిగిందంటూ తీర్పు అనంతరం జూనియర్ వైద్యులు పెదవి విరిచారు. ‘‘ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ నేరంతో పెద్ద వ్యక్తులకు కచి్చతంగా సంబంధముంది. అందుకే క్రైం సీన్‌ను మార్చేశారు. ఆధారాలను చెరిపేశారు. ఆ దిశగా మరింత విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేశారు. అప్పటిదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాయ్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతుండగా ఇందులో మరికొందరి హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యులు వాదిస్తుండటం తెలిసిందే. 50 మంది సాక్షులు కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్ అయిన రాయ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. నవంబర్ 12న మొదలైన రహస్య విచారణ జనవరి 9న ముగిసింది. 50 మంది సాక్షులను విచారించారు. ఘటన జరిగిన మర్నాడు రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్ రాయ్ సోదరి తెలిపారు. ‘‘అతను నేరం చేసినట్లయితే శిక్ష అనుభవించాల్సిందే. విచారణకు మా కుటుంబం హాజరవడం లేదు’’ అని చెప్పారు. 9 Aug: A Trainee doctor was R*PED and MURDERED in #RGKar Hospital.13 Aug: Calcutta HC ordered CBI Probe2 Sept: Former principal Sandip Ghosh arrested.7 Oct: Chargesheet Filed. Sanjay Roy named the key accused.18 January: Trial Court will pronounce the VERDICT Today. pic.twitter.com/NxVA6CXD5o— SAVE THE WORLD 🗺 (@ProtecterIM) January 18, 2025 -
పాట్నా సివిల్ కోర్టు వద్ద పేలుడు..
పాట్నా: బిహార్‌లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇటీవల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫర్మర్ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’ -
సివిల్ వ్యాజ్యాలను విచారించండి
సాక్షి, అమరావతి : భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, ఆస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలు వేటినీ తిరస్కరించొద్దని హైకోర్టు బుధవారం రాష్ట్రంలోని అన్నీ సివిల్ కోర్టులను ఆదేశించింది. కక్షిదారులు దాఖలు చేసే అన్ని దావాలపై విచారణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యాజమాన్య హక్కు చట్టం నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదని తెలిపింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని సవాలు చేస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ), రాష్ట్ర బార్ కౌన్సిల్ తరపున కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, జి.సుదర్శన్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు గంటా రామారావు, ఎన్.సుబ్బారావు, న్యాయవాది యలమంజులు బాలాజీ తదితరులు వాదనలు వినిపించారు. భూ యజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులను హరించే విధంగా ఉందన్నారు. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిందంటూ స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలన్నింటినీ సివిల్ కోర్టులు తిరస్కరిస్తున్నాయని, సంబంధిత అధికారుల వద్దకే వెళ్లాలని కక్షిదారులకు చెబుతున్నాయని తెలిపారు. ఇంకా నోటిఫికేషనే ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదని, కొంత సమయం పడుతుందని తెలిపారు. నిబంధనలను కూడా రూపొందించాల్సి ఉందన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ (టీఆర్వో), ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించాల్సి ఉందన్నారు. కాబట్టి, స్థిరాస్తి దావాలను సివిల్ కోర్టులు తిరస్కరించాల్సిన అవసరం లేదన్నారు. కక్షిదారులు సివిల్ కోర్టులకు వెళ్లకుండా ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. కొత్త దావాలను తిరస్కరించవద్దని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా సివిల్ కోర్టులను కోరుతున్నట్లు చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, స్థిరాస్తి దావాలను తిరస్కరించవద్దని సివిల్ కోర్టులను ఆదేశించింది. -
భూ హక్కులకు భరోసా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది. వీటివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వీటిని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తేవడంతోపాటు భూముల రీ సర్వేను ప్రారంభించారు. ప్రస్తుతం భూముల రీ సర్వే విజయవంతంగా కొనసాగుతుండగా ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి తెచ్చారు. హైకోర్టులో ఎప్పుడైనా అప్పీల్‌కు అవకాశం ఈ చట్టం వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రీ సర్వే ద్వారా భూముల డిజిటల్ రికార్డులను ఇప్పటికే పక్కాగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిరాస్తుల శాశ్వత రిజిష్టర్ రూపకల్పనతో ఆ ఆస్తిని యజమాని మినహా మరెవరూ విక్రయించేందుకు అవకాశం ఉండదు. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ జరగడంతో వివాదాలకు ఆస్కారం ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ అమల్లోకి వచ్చింది. హక్కుల రిజిస్టర్లో నమోదైన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు కొత్తగా ఏర్పడే జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లలో అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు లేకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములకు శాశ్వత హక్కుదారులుగా గుర్తించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండేళ్ల తర్వాత ట్రిబ్యునళ్లలో అవకాశం లేకపోయినా హైకోర్టులో మాత్రం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో సివిల్ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివాదాలు త్వరితగతిన పరిష్కారం కానున్నాయి. కింది కోర్టులపై తగ్గనున్న భారం కొత్త చట్టం ద్వారా ఇప్పటి మాదిరిగా కింది స్థాయి సివిల్, రెవెన్యూ కోర్టులకు భూ వివాదాలను పరిష్కరించే అధికారం ఉండదు. ఆయా కోర్టుల్లో వేలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండడం విపరీతమైన భారం పడుతున్న విషయం తెలిసిందే. కింది స్థాయి సివిల్ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. సంవత్సరాలు గడిచినా కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎక్కడైనా ఒక భూమికి సంబంధించిన వివాదం తలెత్తితే ఆర్డీవో, జేసీ కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావడంలేదు. ఆ వివాదం సివిల్ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. రెండు మూడు తరాలు గడిచినా ఇవి తేలకపోవడంతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది. -
లక్నో కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సివిల్ కోర్టు ఆవరణలో పట్టపగలే దారుణం జరిగింది. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవా దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ దుస్తుల్లో వచ్చిన షూటర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనలో ఒక పోలీసు, ఓ మైనర్ బాలిక గాయపడ్డారని, నిందితుడిని అక్కడికక్కడే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ క్రిమినల్ కేసులో జీవాను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ శిరాద్కర్ తెలిపారు. కాల్పులు అనంతరం కోర్టు ఆవరణలో పోలీసులను భారీగా మోహరించారు. గాయపడిన కానిస్టేబుల్, బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అనుచరుడైన జీవా (48) ముజఫర్‌నగర్ జిల్లా వాసి. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రాయ్, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బ్రహ్మ్ దత్తా ద్వివేది హత్య కేసులో నిందితుడు. మరో 24 కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. 1997 ఫిబ్రవరిలో ఫరూఖాబాద్ జిల్లాలో ద్వివేది హత్యకు గురయ్యాడు. ద్వివేదితోపాటు అతని గన్‌మెన్ హత్య కేసులో ట్రయల్‌కోర్టు జీవాను దోషిగా నిర్ధారించింది. జీవిత ఖైదు విధించింది. కోర్టు ఆవరణలోనే కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణలో, భద్రతా ఏర్పాట్లో్ల విఫలమయ్యాయని ఆరోపించారు. -
జయలలిత ఆస్తులను వివరాలను ఇవ్వండి!
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆపీసర్(పీఓఐ) ఉత్తర్వును సివిల్ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు. వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి. ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
తల్లిదండ్రులు.. దత్త పుత్రుడు.. సొంత కొడుకు !
సాక్షి, హైదరాబాద్: కష్టపడి పెంచి పెద్ద చేసిన దత్తపుత్రుడు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో అతనికి ఆదివారం లోక్‌అదాలత్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించారు. నగరానికి చెందిన భార్యభర్తలకు పిల్లలు కలగకపోవటంతో ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. సొంత కొడుకులా అప్యాయంగా చూసుకున్నారు. ప్రయోజకుడ్ని చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్చించారు. కొన్నేళ్ల తర్వాత ఆ జంటకు కుమారుడు కలిగాడు. దత్త పుత్రుడితో పాటు సొంత కొడుకును కూడా అల్లారుముద్దుగానే చూసుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ కుటుంబ పెద్దకు ఆరోగ్యం సహకరించకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు మొదలవ్వడంతో సొంత కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. ఇదే సమయంలో దత్త పుత్రుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకోవటం మానేశాడు. వారింటిని ఆక్రమించేశారు. మరోవైపు సొంత కొడుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తల్లిదండ్రుల పోషణే గగనమైపోయింది. సొంత కొడుకు కంటే ఎక్కువగా పెంచి పెద్దచేసిన దత్త పుత్రుడ ప్రవర్తన చూసి కుంగిపోయిన వృద్ధ జంట.. అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి చొరవతో న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ సమక్షంలో వృద్ధ జంట, దత్తపుత్రుడు, ఆయన భార్య, సొంత కొడుకును పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల బాధ్యత విషయంలో దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చారు. దత్త పుత్రుడు, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తి, డబ్బు అప్పగించారు. పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అనంతరం ఖలీల్ అనే వ్యక్తిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పు వసూలు కేసును ఉభయ పార్టీలు రాజీ పద్ధతిలో పరిష్కరించుకున్నాయి. తన తల్లి చేసిన బ్యాంకు అప్పును , తన తల్లి మరణానంతరం ఆమె కుమారుడు చెల్లించడానికి ముందుకు రాగా, ఎస్బీఐ కొంత అప్పును మినహాయించి కొడుకుతో రాజీకి ముందుకొచ్చింది. ప్రాథమిక దశలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్న ఉభయ పక్షాలను సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యారా అభినందించి వారికి అవార్డు కాపీలను అందజేశారు. (చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం) -
దాసరి కొడుకులకు నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ సివిల్ కోర్ట్
-
దాసరి నారాయణరావు ఇంటికి కోర్టు నోటీసులు
దివంగత సినీ దర్శకులు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది. ఆయన తనయులు దాసరి అరుణ్, దాసరి ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్ కోర్టు బుధవారం నోటీసులు పంపింది. వ్యాపార లావేదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం సోమ శేఖర్‌రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్‌లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. చదవండి: అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక తిరిగి డబ్బులు చెల్లించడంలో వారు జప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్ రావు సివిల్ కోర్టును ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడంలేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటే అతడు పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ రెండు వారాల్లో డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. చదవండి: Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అప్డేట్.. పవన్ లుక్ అదుర్స్ -
TS: న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్న వారు తమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుకోకుండా సివిల్ కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందుతూ న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. నిర్మాణాలు పూర్తయ్యాక ఈ పిటిషన్లను ఉపసంహరించుకోవడం లేదా హాజరుకాకుండా ఉంటున్నారని పేర్కొంది. ఒక్క అంబర్‌పేట డివిజన్‌లోనే ఈ తరహాలో సివిల్ కోర్టుల్లో 189 పిటిషన్లు దాఖలుచేసి మధ్యంతర ఉత్తర్వులు పొందారని, జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌లో ఇలాంటి వేలాది పిటిషన్లు దాఖలై ఉంటాయని పేర్కొంది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయరాదంటూ హైకోర్టు సివిల్ కోర్టులను ఆదేశించినా సివిల్కోర్టులను ఆశ్రయించి ఉత్తర్వులు పొందుతూనే ఉన్నారని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి తగిన ఉత్తర్వులు జారీచేయాలని, ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడంపై దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి..అంబర్‌పేట సర్కిల్లో ఎంతమంది సివిల్ కోర్టులను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొంది నిర్మాణాలు చేపట్టారో పేర్కొంటూ నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డిని ఆదేశించారు. 189 మంది ఇలా అక్రమ నిర్మాణాలు పూర్తి చేసినట్లు కృష్ణారెడ్డి వివరించారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఈ సివిల్ కేసుల్లో ఆయా వ్యక్తులు హాజరుకావడం లేదని, దీంతో కోర్టు వాటిని కొట్టివేస్తోందని తెలిపారు. -
లోక్ అదాలత్‌లో 15,607 కేసుల పరిష్కారం
సాక్షి అమరావతి/విజయవాడ లీగల్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో 15,607 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 15,045 పెండింగ్ కేసులు, 562 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. రూ.25.50 కోట్లు పరిహారంగా చెల్లించారు. హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 561 కేసులను పరిష్కరించారు. రూ.7.04 కోట్లు పరిహారంగా చెల్లించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ మార్గదర్శకంలో లోక్ అదాలత్ నిర్వహించినట్టు అథారిటీ సభ్య కార్యదర్శి చిన్నం శెట్టి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. యాక్సిడెంట్ కేసులో రూ.28 లక్షల పరిహారం ఇదిలా ఉండగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో బాధితులకు అత్యధికంగా రూ.28 లక్షల పరిహారాన్ని పూర్తి అదనపు ఇన్చార్జ్ విజయవాడ నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి జి.దుర్గయ్య అందజేశారు. కృష్ణలంకకు చెందిన సమ్మెట పార్థసారథి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2018 సెప్టెంబర్ 9న ఆర్టీసీ హయ్యర్ బస్ ఢీ కొట్టడంతో మరణించారు. అతని భార్య నవ్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రూ.30 లక్షల పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది నరసింహారావు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి బాధితురాలికి రూ.28 లక్షలు పరిహారం వచ్చేలా చేశారు. బార్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో బాధితురాలికి అవార్డ్ కాపీ అందచేశారు. -
అలా అయితే భరణం అవసరం లేదు..
సాక్షి, ముంబై : భార్య సంపాదిస్తుంటే ఆమెకు తన భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని సెషన్స్ కోర్టు వెల్లడించింది. తన భార్యకు మెయింటెనెన్స్ కింద సొమ్ము ఇవ్వాలని మేజిస్ర్టేట్ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌పై ఎగువ కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. భార్యకు తగినంత ఆదాయ వనరులుంటే ఆమెకు మధ్యంతర మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కంది. భార్యతో విడిపోయిన నలసపోరాకు చెందిన 35 సంవత్సరాల వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై సెషన్స్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పీల్ చేసుకున్న వ్యక్తి బార్య నెలకు రూ 17,000 నుంచి రూ 18,000 వేతనం పొందుతున్నట్టు ఆమె వేతన సర్టిఫికెట్ వెల్లడిస్తోందని, అయితే ఆమెకు నెలకు రూ 6000 మెయింటెనెన్స్ చెల్లించాలని విఖ్రోలి మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో ఆమె ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోలేదని సెషన్స్ కోర్టు పేర్కొంది. ప్రాధమిక ఆధారాల ప్రకారం ఆమెకు తగిన జీవనోపాధి ఉన్నందున మధ్యంతర నిర్వహణ ఖర్చులకు అర్హురాలు కాదని స్పష్టం చేసింది. అయితే పిల్లలకు చెల్లించాల్సిన రూ రెండు వేల మెయింటెనెన్స్ ఉత్తర్వులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని సెషన్స్ కోర్టు తెలిపింది. కాగా, భార్య సంపాదనాపరురాలైతే ఆమెకు భర్త జీతంలో నుంచి భరణం చెల్లించనవసరం లేదని గతంలోనూ పలు కోర్టులు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
అక్రమాలపై ధర్మాసనం కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఉద్యోగుల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సొసైటీని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి ఆర్థిక అవకతవకలు.. అవినీతి కేసులు.. వివాదాలు.. విచారణలు ఎదుర్కొంటున్న సొసైటీని తన నియంత్రణలోకి తీసుకుంది. నియంత్రణ బాధ్యతలను హైదరాబాద్ సిటీసివిల్ కోర్టు చీఫ్ జడ్జికి అప్పగించింది. సొసైటీ రోజువారీ నిర్వహణ, ఆస్తులు, ఇతర వ్యవహారాలన్నీ కూడా చీఫ్ జడ్జి ఆధ్వర్యంలోనే జరుగుతాయని తెలిపింది. సొసైటీ కార్యాలయంలోని రికార్డులను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధి వరకు సొసైటీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. సొసైటీ ఉద్యోగుల వేతనాల చెల్లింపు నిమిత్తమే బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ చెల్లింపులన్నీ కూడా సివిల్‌కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి చేతుల మీదుగా జరగాలని ఆదేశించింది. సొసైటీకి కేటాయించిన భూమిని సైతం స్వాధీనం చేసుకోవాలని చీఫ్ జడ్జికి సూచించింది. సొసైటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు దాని ఖాతాలను ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం కోఆపరేటివ్ సొసైటీస్ జాయింట్ రిజిస్ట్రార్ సి.సాయప్ప, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఆర్.సంగీత, డి.విజయలక్ష్మిలతో ఓ బృందాన్ని నియమించింది. హైకోర్టు న్యాయవాదులు వేదుల శ్రీనివాస్, ఎస్.మమత ఆదేశాల మేరకు ఆడిట్ బాధ్యతలను నిర్వర్తించాలని ఆ బృందానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ బృందానికి శ్రీనివాస్‌ను చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆడిట్ నిర్వహణకు అవసరమైన ఫైళ్లను, ఖాతా పుస్తకాలను ఈ బృందానికి అందుబాటులో ఉంచాలని చీఫ్ జడ్జికి సూచించింది. ఏ రికార్డులున్నా వెంటనే చీఫ్ జడ్జికి అప్పగించండి... సొసైటీ రికార్డులను వెంటనే చీఫ్ జడ్జికి అప్పగించాలని సహకార శాఖను, సొసైటీ ప్రస్తుత, పూర్వ కార్యవర్గ సభ్యులను హైకోర్టు ఆదేశించింది. ఆడిట్ బృందం కోరిన రికార్డులు ఇవ్వని పక్షంలో ప్రాసిక్యూషన్‌కు సైతం ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్పష్టతను తమ నుంచి చీఫ్ జడ్జి లేదా ఆడిట్ బృంద చైర్పర్సన్ పొందవచ్చని హైకోర్టు తెలిపింది. సొసైటీ చేసిన తీర్మానాలు, భూకేటాయింపు, లేఅవుట్ అభివృద్ధి, ఇతర కేటాయింపుల వివరాలను విచారణ నాటికి తమ ముందుంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దృష్టి సారించిన ప్రధాన న్యాయమూర్తి హౌసింగ్ సొసైటీ పాలకమండళ్ల తీరు, ప్లాట్ల కేటాయింపులు, ఓటర్ల జాబితా.. బైలాస్ సవరణ.. ఎన్నికలు, సొసైటీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు ఉద్యోగులు, సొసైటీ పాలకులు పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖ లు చేశారు. 2014 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ వివాదాలపై దృష్టి సారించారు. సొసైటీకి సంబంధించిన పూర్తివివరాలను పాలనాపరంగా తెప్పించుకున్నారు. అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించాలని నిర్ణయించారు. అందులో భాగం గా ఇటీవల ఈ వ్యాజ్యాలను జస్టిస్ రాధాకృష్ణన్ నేతృ త్వంలోని ధర్మాసనం విచారించింది. సొసైటీ సభ్యులుగా ఉన్న హైకోర్టు ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులతో వివాదాలకు ఫుల్స్టాప్ పడుతుందని హైకోర్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
లైంగిక వేధింపుల కేసులో జడ్జి అరెస్ట్
హైదరాబాద్/తుంగతుర్తి: ప్రేమపేరుతో దళిత యువతిని మోసం చేసిన జడ్జిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సత్యనారాయణరావు హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఉంటున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సివిల్ కోర్టు మహిళా న్యాయవాది రజిని ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల సత్యనారాయణరావు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయమై సత్యనారాయణరావును నిలదీయగా అతడితో పాటు ఆయన తల్లి రజినీపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. దీంతో ఈ నెల 4న ఆమె చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు సత్యనారాయణరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసు నమోదు చేశారు. హైకోర్టు అనుమతితో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. -
‘ఆ అధికారాలన్నీ మధ్యవర్తికి ఉండవు’
సాక్షి, హైదరాబాద్ : సివిల్ కోర్టుకున్న అధికారాలన్నీ మధ్యవర్తి(ఆర్బిట్రేటర్)కి ఉండవని హైకోర్టు తెలిపింది. మధ్యవర్తి కోర్టుతో సమానం కాదని పేర్కొంది. మధ్యవర్తి కేవలం కోర్టుకు ఓ ప్రత్యామ్నాయ వేదిక మాత్రమేనని స్పష్టం చేసింది. సివిల్ కేసుల్లో అభ్యర్థనలు వేర్వేరుగా ఉండి, వైరుద్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నప్పుడు ఆ కేసులను సివిల్ కోర్టే విచారించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి కేసులను మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలని సివిల్ కోర్టు తీర్పునివ్వడం సరికాదని తెలిపింది. ఇలా ఓ సివిల్ వివాదంలో మియాపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో తనకున్న 1,136 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు 2007లో పాపారావు అనే వ్యక్తితో మురళీధరరావు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత 2009లో పాపారావు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్తో మురళీధరరావు మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయంలో వివాదం తలెత్తడంతో మియాపూర్ కోర్టులో మురళీధరరావు 2016లో పిటిషన్ దాఖలు చేశారు. తన స్థలంలోని భవనంలో అద్దెకున్న సుయోషా హెల్త్‌కేర్ సంస్థను తనకు అద్దె, ఇతర బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. తన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా పాపారావు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ను నిరోధించాలని అభ్యర్థించారు. ఇదే కేసులో పాపారావు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కూడా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసి, వివాదాన్ని మధ్యవర్తికి నివేదించాలని కోరాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన మియాపూర్ కోర్టు ఆ మేర తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మురళీధరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో రాజశేఖర్ నటించిన ‘పీయస్వీ గరుడ వేగ’ చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగింది? గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్ పేర్కొన్నారు. అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం. -
సిటీ సివిల్ కోర్టుకు కృష్ణ మాదిగ
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతోపాటు 11 మంది నాయకులను రాంగోపాల్‌పేట్ పోలీసులు బుధవారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 11వ ఏసీఎం జడ్జి ముందు హాజరుపరిచారు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపై విచారణ జరిపారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాద నలు జరగనున్నట్లు కృష్ణమాదిగ తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు వద్ద కృష్ణ మాదిగను కలిసేందుకు ప్రయత్నించిన టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులును పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మరోసారి మోసగిస్తున్నారని విమర్శించారు. కృష్ణ మాదిగపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మందకృష్ణను బేషరతుగా విడుదల చేయాలి ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ డిమాండ్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణను వెంటనే విడుదల చేయాలని ఆ సమితి జాతీయ కమిటీ డిమాండ్ చేసింది. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించింది. ఎమ్మార్పీఎస్ నేతల అరెస్టు నేపథ్యంలో జాతీయ కమిటీ నేతలు ఉసురుపాటి బ్రహ్మయ్య, మందకుమార్, నకిరకంటి యాదయ్య, తీగల ప్రదీప్ తదితరులు బుధవారం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్ సందర్భంగా కేసీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులను మించి నిరంకుశంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మందకృష్ణను విడుదల చేయాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే శనివారం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
దావా వేసిన వ్యక్తి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కింది కోర్టుల్లో సివిల్ దావా దాఖలు చేసే వ్యక్తులు కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వకపోతే ఆ దావా చట్ట ప్రకారం సరైనది కాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. దావా వేసిన వ్యక్తి కచ్చితంగా కోర్టుకొచ్చి తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఇటీవల తీర్పునిచ్చారు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఆ ఆస్తికి తనను వారసురాలిగా ప్రకటించాలని కోరుతూ ఎన్.గంగమ్మ అనే మహిళ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దావా దాఖలు చేశారు. అయితే ఈ కేసులో నిబంధనల ప్రకారం వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఎవరిపైనైతే దావా దాఖలు చేశారో వారికి క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో కింది కోర్టు ఆమె దావాను తోసిపుచ్చింది. దీనిపై ఆమె హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సురేశ్ కెయిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తిపై హక్కు కోరుతున్న గంగమ్మ, ఆ ఆస్తికి తాను ఏ విధంగా వారసురాలు, ఆ ఆస్తి ఎప్పుడు, ఎవరు ఇచ్చారు? తదితర వివరాలను తెలియచేసేందుకు కోర్టుకు రాలేదని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దావా వేసిన వ్యక్తి తప్పనిసరిగా కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే గంగమ్మ ఆ పని చేయకపోవడం సరికాదని స్పష్టం చేసింది. ఇలా హాజరుకాని పక్షంలో ఆ దావాను సక్రమమైనదిగా భావించే ఆస్కారం లేదు కాబట్టి, కింది కోర్టు ఆమె దావాను తోసిపుచ్చడంలో తప్పులేదంటూ గంగమ్మ పిటిషన్‌ను కొట్టేసింది. -
విచారణకు ఆదేశించండి
- జూబ్లీ క్లబ్ అక్రమాలపై సివిల్ కోర్టులో పిటిషన్ - గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని వినతి సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జూబ్లీ క్లబ్) సభ్యత్వాలు, నిర్మాణాల విషయాల్లో అక్రమాలపై విచారణ జరిపేందుకు ఓ విచారణాధికారిని నియమించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సభ్యత్వ రుసుం వసూలు చేయకుండా సభ్య త్వాలు ఇవ్వడం, కోట్ల రూపాయల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయంటూ హైకోర్టు న్యాయవాది డి.వి.శివప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు టి.దేవేందర్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కోశాధికారి ఎ.సుబ్బారావు, సభ్యులు వెంకటేశ్వరరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.జనార్దన్‌రెడ్డి, ఎం.వెంకటరామయ్య తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 20 వేల చదరపు అడుగుల్లో చేపట్టాల్సిన నిర్మాణాలను 1.2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు. ఈ నిర్మాణాలకు రూ.30 కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపుతున్నారన్నారు. నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై థర్డ్ పార్టీ ఆడిటర్లను నియమించాలని గవర్నింగ్ కౌన్సిల్లో ప్రాథమికంగా నిర్ణయించగా, ఆ తరువాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారని ఆయన వివరించారు. ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు... గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు 2010 నుంచి 2017 వరకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు పొందారని పిటిషనర్ తెలిపారు. ఇదంతా అధ్యక్ష, కార్యదర్శులకు తెలిసే జరిగిందన్నారు. సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. -
బీసీల కొత్త కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న ‘సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సీఎస్‌ఈబీసీ)’కు సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలను కల్పించనుంది. ప్రస్తుతమున్న వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)ను రద్దు చేసి.. దాని స్థానంలో ఎన్సీఎస్ఈబీసీని ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధత కలిగిన ఎన్‌సీఎస్‌ఈబీసీ.. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. బీసీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కొత్త కమిషన్‌లో చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తోపాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. ఈ కమిషన్ ద్వారా ఓబీసీ కేంద్ర జాబితాలోకి చేర్చే సామాజిక వర్గాలను.. జాబితా నుంచి తొలగించే వీలు లేకుండా చట్టబద్ధత కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఓబీసీల్లోకి చేర్చాలంటూ జాట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
కోర్టు ఉత్తర్వులను పోలీసులు అమలు చేయాల్సిందే..
సివిల్ వివాదాల్లో ఆస్తులపై హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదాల్లో ఆస్తుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాలు ఇచ్చే ఉత్తర్వులను పోలీసులు అమలు చేయాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఉత్తర్వులిచ్చినప్పటికీ ఓ స్థలంలోకి ఇతరులను అనుమతించడాన్ని తప్పుపట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ ఎకరా భూమి వివాదం రంగారెడ్డి జిల్లా రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దీని అమలుకు పిటిషనర్లు సహాయం కోరినా పోలీసు పట్టించుకోలేదు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపి కోర్టు ఉత్తర్వులిచ్చినా, పిటిషనర్ల స్థలానికి రక్షణ కల్పించేందుకు సైబరాబాద్ పోలీ సులు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. -
బీఎస్ రాములు అధ్యక్షతన బీసీ కమిషన్
సభ్యులుగా వకుళాభరణం, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లో వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం కోసం ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములు చైర్మన్‌గా బీసీ కమిషన్‌ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయగౌడ్, ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ ఇందులో సభ్యులు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కమిషన్ పదవీ కాలా న్ని మూడేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం అనంతరం బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో అత్యవసరంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయా ల్సిన పరిస్థితులుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కమిషన్ విధులివి: బీసీల జాబితాలో కొత్త కులాలు, వర్గాలు చేర్పుల అభ్యర్థనలు, తొల గింపులపై ఫిర్యాదులను కమిషన్ పరిశీలించి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. బీసీలకు సంబంధించి ఇతర అంశంపై పరిశీలించి, ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. అధికారాలివి..: సివిల్ కోర్టుకు ఉండే పలు ప్రత్యేకాధికారాలు బీసీ కమిషన్‌కు ఉంటాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా వ్యక్తుల హాజ రును కోరుతూ సమన్ల జారీకి, ఏదైన డాక్యుమెంట్‌ను కోరడానికి, అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాల స్వీకరణకు, ఏదైన కోర్టు నుంచి పబ్లిక్ రికార్డుకు సంబంధించినకాపీని కోరడానికి, సాక్షుల, డాక్యుమెంట్లు పరిశీలించే అధికారాలు కమిషన్‌కు ఉంటాయని తెలిపింది. ఇప్పుడెందుకు..?: నిబంధన ప్రకారం మూడేళ్లకోసారి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. పదేళ్లకోసారి బీసీల జాబితాపై సమీక్ష జరపాలి. చివరిసారిగా, ఉమ్మడి రాష్ట్రంలో సుబ్రమణ్యం నేతృత్వంలో ఏర్పాటైన బీసీ కమిషన్ గడువు 2011 సెప్టెంబర్‌తో ముగిసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 26 బీసీ కులాలు ఇక్కడి రాష్ట్రంలో లేవని బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించడంపై వివాదం రేకెత్తించింది. వీటిని మళ్లీ జాబితాలో చేర్చడం, ఇతర కొత్త డిమాండ్లపై పరి శీలన కోసం ఈ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. బీసీ-ఈ కేటగిరీలో ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచే అంశంపై కమిషన్ సిఫారసులు కీలకం కానున్నాయి. బీసీ కమిషన్ వద్దు: బీసీ సంక్షేమ సంఘం సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్‌పై టీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నరేందర్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ న్యాయమూర్తితో ఏర్పాటు చేయాల్సిన కమీషన్‌ను సామాజిక ఉద్యమకారులతో ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులకు గతంలోనే విన్నవించినా పట్టించుకోలేదన్నారు. బీఎస్ రాములు, చైర్మన్: ప్రసిద్ధ రచయిత, బహుగ్రంథ కర్త. ప్రస్తుతం జగిత్యాల జిల్లావాసి. పద్మశాలి సామాజికవర్గం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు. డాక్టర్ వి.కృష్ణమోహన్‌రావు, సభ్యులు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్వాస్తవ్యులు. దాసరి సామాజికవర్గం. ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు 2004-09 వరకు బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. ఓయూ నుంచి ఎంఏ(తెలుగు) పీహెచ్డీ చేశారు. డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్, సభ్యులు: జోగుళాంబ గద్వాల జిల్లా వాసి. విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు. ఓయూ నుంచి న్యాయ శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. -
చిన్న స్పూన్నూ వదల్లేదు..
మారేడుపల్లి : సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఉన్న అడ్వకేట్స్ క్యాంటీన్లో గురువారం రాత్రి దొంగలుపడ్డారు. పెద్ద వంటగిన్నెల నుంచి స్పూన్ల దాకా ఉన్నవన్నీ ఊడ్చుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్‌పల్లికి చెందిన రమేష్ కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్స్ బార్ అసోషియేషన్ క్యాంటీన్‌ను నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్‌కు తాళాలు వేసి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయ వచ్చి చూసేసరికి క్యాంటిన్లో వంట సామగ్రి కనిపించలేదు. భారీ వంటగిన్నెలతోపాటు చెంచాలను కూడా దుండగులు వదల్లేదు. అంతేకాదు నిల్వ ఉన్న 75 కేజీల బియ్యం, 50 కేజీల పప్పుదినుసులను కూడా మాయం చేసేశారు. వెనుక నుంచి తాళాలను పగుల గొట్టి దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించారు పోలీసులు. భారీ వంట సామగ్రిని తరలించటానికి ట్రాలీ వంటి వాహనంతో దుండగులు పక్కా ప్రణాళికతో వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.85 వేలుంటుందని బాధితుడు తెలిపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
సివిల్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు వద్ద శుక్రవారం న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయమూర్తుల వాహనాలు లోపలికి వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకుంటున్నారు. ప్రత్యేక హైకోర్టు కోరుతూ వారం రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. సంఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. -
కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇస్తారా?
♦ సుజనా ఎండీపై న్యాయస్థానం ఆగ్రహం ♦ పెర్జురీ కేసు పెట్టాలంటూ సిబ్బందికి జడ్జి ఆదేశం ♦ సుజనా చౌదరి- మారిషస్ బ్యాంకు కేసులో మరో మలుపు సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసరాజుపై సిటీ సివిల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి (పెర్జురీ) కోర్టును తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టింది. ఇందుకు ఐపీసీ 191, 193, 199, 200, 206 సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని 11వ అదనపు చీఫ్ జడ్జి తన సిబ్బందిని ఆదేశించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ సంస్థ.. మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రూ.100 కోట్లకు పైగా రుణం తీసుకుని ఎగవేసిన కేసులో ఈ కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా నిందితుడు కావటం గమనార్హం. దీనిపై మారిషస్ కమర్షియల్ బ్యాంకు తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సుజనా సంస్థ ఎండీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు మాకు తెలియగానే కోర్టుకు ఫిర్యాదు చేశాం. న్యాయస్థానం దీనిపై ప్రాథమిక విచారణ జరిపింది. మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చింది. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చీఫ్ మెజిస్ట్రీరియల్ అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు’’ అని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవలే మారిషస్ బ్యాంకు దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి సుజనా చౌదరికి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది.