- జూబ్లీ క్లబ్ అక్రమాలపై సివిల్ కోర్టులో పిటిషన్
- గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని వినతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జూబ్లీ క్లబ్) సభ్యత్వాలు, నిర్మాణాల విషయాల్లో అక్రమాలపై విచారణ జరిపేందుకు ఓ విచారణాధికారిని నియమించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సభ్యత్వ రుసుం వసూలు చేయకుండా సభ్య త్వాలు ఇవ్వడం, కోట్ల రూపాయల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయంటూ హైకోర్టు న్యాయవాది డి.వి.శివప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు టి.దేవేందర్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కోశాధికారి ఎ.సుబ్బారావు, సభ్యులు వెంకటేశ్వరరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.జనార్దన్‌రెడ్డి, ఎం.వెంకటరామయ్య తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం 20 వేల చదరపు అడుగుల్లో చేపట్టాల్సిన నిర్మాణాలను 1.2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు. ఈ నిర్మాణాలకు రూ.30 కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపుతున్నారన్నారు. నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై థర్డ్ పార్టీ ఆడిటర్లను నియమించాలని గవర్నింగ్ కౌన్సిల్‌లో ప్రాథమికంగా నిర్ణయించగా, ఆ తరువాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారని ఆయన వివరించారు.
ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు...
గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు 2010 నుంచి 2017 వరకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు పొందారని పిటిషనర్ తెలిపారు. ఇదంతా అధ్యక్ష, కార్యదర్శులకు తెలిసే జరిగిందన్నారు. సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
విచారణకు ఆదేశించండి
Published Fri, Aug 25 2017 2:37 AM | Last Updated on Tue, Sep 12 2017 12:56 AM
Advertisement