Jubilee Club
-
విచారణకు ఆదేశించండి
- జూబ్లీ క్లబ్ అక్రమాలపై సివిల్ కోర్టులో పిటిషన్ - గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని వినతి సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జూబ్లీ క్లబ్) సభ్యత్వాలు, నిర్మాణాల విషయాల్లో అక్రమాలపై విచారణ జరిపేందుకు ఓ విచారణాధికారిని నియమించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సభ్యత్వ రుసుం వసూలు చేయకుండా సభ్య త్వాలు ఇవ్వడం, కోట్ల రూపాయల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయంటూ హైకోర్టు న్యాయవాది డి.వి.శివప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు టి.దేవేందర్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కోశాధికారి ఎ.సుబ్బారావు, సభ్యులు వెంకటేశ్వరరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.జనార్దన్‌రెడ్డి, ఎం.వెంకటరామయ్య తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 20 వేల చదరపు అడుగుల్లో చేపట్టాల్సిన నిర్మాణాలను 1.2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు. ఈ నిర్మాణాలకు రూ.30 కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపుతున్నారన్నారు. నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై థర్డ్ పార్టీ ఆడిటర్లను నియమించాలని గవర్నింగ్ కౌన్సిల్లో ప్రాథమికంగా నిర్ణయించగా, ఆ తరువాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారని ఆయన వివరించారు. ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు... గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు 2010 నుంచి 2017 వరకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు పొందారని పిటిషనర్ తెలిపారు. ఇదంతా అధ్యక్ష, కార్యదర్శులకు తెలిసే జరిగిందన్నారు. సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. -
జూబ్లీ క్లబ్లో టెన్నిస్ కోచింగ్ క్యాంప్
-
కలర్స్ ..అదుర్స్
-
జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడిగా దేవేందర్‌రెడ్డి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక కమిటీ ఎన్నికల్లో టి. దేవేందర్‌రెడ్డి ప్యానల్ ఘనవిజయం సాధించింది. తన ప్రత్యర్థి జైవీర్‌రెడ్డిపై దాదాపు 951 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. దేవేందర్‌రెడ్డితో పాటుగా సభ్యులు సైతం సుమారు 900 పైచిలుకు మెజారిటీతోనే ఈ విజయం దక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ పాలక వర్గానికి ఆరేళ్ల తర్వాత ఎన్నికలు ఆదివారం క్లబ్ సెక్రటరీ హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్ పోటీ పడ్డాయి. దేవేందర్‌రెడ్డి అధ్యక్షునిగా జగ్గారావు, రమేష్‌చౌదరి, శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌లు సభ్యులుగా బరిలో నిలిచారు. మరో ప్యానల్ జూవీర్‌రెడ్డి అధ్యక్షతన అశోక్‌రెడ్డి, కిషన్‌రావు, ఏవీఆర్‌కే. ప్రసాద్, డాక్టర్. జీఆర్‌యం. రెడ్డిలు ఎన్నికల్లో పోటీ చేశారు. సంయుక్త కార్యదర్శిగా పీఎస్.రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భాగంగా క్లబ్‌లోని 2560 మంది ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో 1863 మంది వారి ఓటు వేశారు. అంతకుముందు ఈవీయం మిషన్లతో ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేంద్రచౌదరి, సీవీ.రావు తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేవేందర్‌రెడ్డి ప్యానల్ విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన అనంతరం ప్యానల్ ఆధ్వర్యంలో క్లబ్ ముందు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ క్లబ్ తో పాటు సభ్యులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కోశాధికారి జగ్గారావును ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు దేవేందర్‌రెడ్డి ప్రకటించారు.