పాట్నా: బిహార్‌లోని పాట్నా సివిల్ కోర్టు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో ఇద్దరు మరణించారు. వీరిలో ఒకరు లాయర్ కూడా ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఆ ఘటన వెలుగుచూసింది. సివిల్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ క్మంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫర్మర్ పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: ‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
పాట్నా సివిల్ కోర్టు వద్ద పేలుడు.. న్యాయవాది సహా ఇద్దరు మృతి
Published Wed, Mar 13 2024 5:26 PM | Last Updated on Wed, Mar 13 2024 6:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment