
సాక్షి, న్యూఢిల్లీ : పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని ఓ ఇంటిలో సోమవారం ఉదయం జరిగిన పేలుడులో 12 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దాదాపు ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి. పేలుడులో గాయపడినవారిని పట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా పేలుడుకు కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు.
ఘటనాస్ధలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కాగా ఇంటిలో దాచిన బాంబు పేలడంతో సమీపంలోని ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పట్నా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment