
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆపీసర్(పీఓఐ) ఉత్తర్వును సివిల్ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు.
వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి.
ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది.
(చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం)
Comments
Please login to add a commentAdd a comment