jayalalita
-
టాలీవుడ్ నటి జయలలితతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. చలపతిరావు వల్లే బతికి బయటపడ్డాను: నటి
సినీ, టీవీ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా వెండితెరపై మెప్పించిన ఆమె నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందారు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసిన ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత జంబలకిడి పంబా, ఆ ఒక్కటి అడక్కు వంటి సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశారు. అందాల తారగానూ గుర్తింపు పొందిన ఆమె స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగుల వేశారు. చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్ అయితే ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన వారం రోజులకే భర్త నిజస్వరూపం భయపడింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకున్నట్లు గతంలో ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. తాజాగా ఆమె పాత వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఓ మూవీ సమయంలో వినోద్‌తో పరిచయం ఏర్పడింది. ఓ సంఘటనలో ఆయన నన్ను సేవ్ చేశాడు. దీంతో అతడికి కనెక్ట్ అయ్యాను. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. కానీ ఆయనను పెళ్లి చేసుకోవద్దని సీనియర్ నటుడు చలపతి రావు, ప్రొడ్యూసర్ జయకృష్ణగారు నన్ను హెచ్చరించారు. ఇక పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే చచ్చిపోతానంటూ ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానన్నాడు. దాంతో నా మనసు కరిగి పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో వాళ్లు ఆయనతో పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. దీంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న. ఇష్టం లేకపోయిన మా వాళ్లు ఆ పెళ్లికి వచ్చారు. అయితే కట్నం ఇవ్వడానికి నా పుట్టింట వాళ్లు ఓ అగ్రిమెంట్ రాయించుకున్నారు. పిల్లలు పుట్టాకే నాకు చెందాల్సిన ఆస్తి ఇస్తామంటూ బాండ్ పేపర్‌పై నాతో సంతకం చేయించుకున్నారు. పెళ్లయిన వారం రోజులకు ఇది ఆయనకు తెలిసింది. దీంతో నువ్వు ఎందుకు సంతకం చేశాడు.. ఆ బాండ్ క్యాన్సిల్ చేసుకోమంటూ నన్ను వేధించాడు. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు ఇక అప్పుడే అర్థమైంది ఆస్తి కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని. అలా మూడు నెలలు పంటికింద బాధలను భరించాను. ఆ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక నీకు నాకు సెట్ అవ్వదు విడిపోదామని చెప్పా. ఏడాది కాకముందే విడిపోయాం. చివరి రోజుల్లో ఆయన నన్ను ఇంట్లో బంధించాడు. యాసిడ్ పోస్తా, చంపేస్తానంటూ చాలా వేధించాడు. నన్ను హౌజ్ అరెస్ట్ చేస్తే చలపతి రావు గారు, గోపాలకృష్ణ నన్ను ఆ ఇంటి నుంచి విడిపించారు. వారే లేకపోతే ఆ ఇంటిలోనే నేను ఏమైపోయేదాన్నో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి గతంలో జయలలిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. -
జయలలిత ఆస్తులను వివరాలను ఇవ్వండి!
ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆపీసర్(పీఓఐ) ఉత్తర్వును సివిల్ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు. వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి. ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
నువ్వా.. నేనా.. అన్నాడీఎంకేలో పోటాపోటీ!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కీలకమైన ప్రిసీడియం చైర్మన్ పోస్టును చేజిక్కించుకునేందుకు నేతలు ఆపార్టీ నేతలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రేసులో మొత్తం ఏడుగురు నేతలు ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉంది. ఇప్పటి వరకు వళ్లి ముత్తు, నావలన్ నెడుంజెలియన్, పొన్నయ్యన్, పుదుమై పిత్తన్, కాళి ముత్తు, మధుసూదనన్ వంటి నేతలు ప్రిసీడియం చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో మధుసూదనన్ ఒకటిన్నర దశాబ్దం ఆ పదవిలో కొనసాగారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో ఈ పదవిపై సీనియర్ల దృష్టి పడింది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కీలకంగా ఉన్నప్పటికీ, కోర్టుల్లో పార్టీ పరంగా ఉన్న వ్యవహారాల్ని ఎదుర్కొనడం, ఎన్నికల కమిషన్‌తో ముడిపడిన అంశాలన్నీ ప్రిసీడియం చైర్మన్ గుప్పెట్లోనే ఉంటాయి. ప్రధాన పోటీ వారిమధ్యేనా? ఎన్నికల్లో ఓటమి తర్వాత పదవులు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లు ఈ పదవి కోసం తీవ్రంగానే పావులు కదుపుతున్నారు. సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామికి సన్నిహితంగా ఉన్న నేతలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. జేసీడీ ప్రభాకర్, తమిళ్ మగన్ హుస్సేన్, సయ్యద్ ఖాన్, అన్వర్ రాజా, అరుణాచలం, వేనుగోపాల్, ధనపాల్ రేసులో ఉన్నారు. అయితే ధనపాల్, అన్వర్ రాజా, తమిళ్ మగన్ హుస్సేన్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు భావిస్తున్నారు. అన్వర్, హుస్సేన్ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిలో ఒకరికి పదవి కట్టబెడితే.. మరొకరు వ్యతిరేకించే అవకాశం ఉంది. ధనపాల్ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాగా మధుసూదనన్ దివంగత అమ్మ జయలలిత మెచ్చిన ప్రిసీడియం చైర్మనే కాదు, పన్నీరుసెల్వం మద్దతు దారుడు కూడా. దీంతో ఈసారి కూడా తన వర్గీయులకే ఆ పదవి కట్టబెట్టేందుకు పన్నీరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. చదవండి: Tamilnadu: రూ.7 వేల కోట్ల భారం.. అందుకే 60 ఏళ్లకే రిటైర్మెంట్ -
చక్కనమ్మ బరువు పెరిగినా బ్రహ్మాండమే!
ఇప్పుడు అందరి దృష్టి బరువు ఎలా తగ్గాలి, ఎలా స్లిమ్ కావాలి అనేదానిపైనే ఉంది. అయితే బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ ‘తలైవి’ సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 కిలోల బరువు పెరగాల్సి వచ్చిందట. ‘అయినా అందంగానే ఉంది’ అని మురిసిపోయారు అభిమానులు. వారి అభిమానానికేం గానీ పెరిగిన బరువును తగ్గించుకోవడానికి బాగానే చెమటోడాల్సి వచ్చింది కంగనా. జయలలిత బయోపిక్ అంటే మామూలు విషయం కాదు...కొన్ని సీన్లలో చాలా గ్లామర్‌గా కనిపించాలి, కొన్ని సీన్లలో ఫైర్బ్రాండై గర్జించాలి, సమూహంలో ఒంటరిగా, ఒక్కరే మహా సమూహంగా...ఇలా ఎన్నో అవతారాల్లో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవాలి. ఈ కష్టంతో పోల్చితే బరువు తగ్గడం అనేది చాలా ఈజీ అనడంలో తప్పు లేదేమో! -
‘చిన్నమ్మ’ బయటకు రాకుండా కుట్ర!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి బయటకు రాకుండా జాప్యం చేయడంలో కుట్ర జరుగుతున్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆరోపించే పనిలో పడ్డాయి. జప్తు నోటీసులు ఒకదాని తర్వాత మరొకటి జారీ చేస్తుండడంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయం తెలిసిందే. 2021 జనవరిలో ఆమె శిక్షాకాలం ముగియనుంది. జరిమానా రూ. 10 కోట్లు చెల్లింపు తర్వాత జైలు నుంచి చిన్నమ్మ బయటకు రావడం ఖాయమని అమ్మ శిబిరం వర్గాలు దీమా వ్యక్తం చేశాయి. ఇందుకు తగ్గ కసరత్తుల్లో దినకరన్ నిమగ్నమయ్యారు. (చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..) ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అక్రమంగా ఆర్జించారంటూ ఆస్తుల అటాచ్, షోకాజ్ నోటీసులు ఒక దాని తర్వాత మరొకటి వెలువడుతుండడం అమ్మ శిబిరంలో కలవరాన్ని రేపింది. ఇప్పటికే ఐటీ రెండు విడతలుగా ఆస్తుల్ని జప్తు చేసింది, మూడో విడతగా రూ. రెండువేల కోట్ల ఆస్తులను బుధవారం అటాచ్ చేసింది. నోటీసులను సిరుదావూర్ బంగ్లా, కొడనాడు ఎస్టేట్లలో ఐటీ వర్గాలు గురువారం అంటించి వెళ్లాయి. అమ్మ వారసులుగా దీప, దీపక్‌లను కోర్టు ప్రకటించిన దృష్ట్యా, వారికి కూడా షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇప్పటివరకు రూ. 3,900 కోట్ల విలువగల ఆస్తులను ఐటీ జప్తు చేసింది. చిన్నమ్మ విడుదలను అడ్డుకోవడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందని అమ్మ శిబిరం ఆరోపిస్తోంది. ఎన్నికల అనంతరం వచ్చేలా కుట్ర సాగుతోందని, అందుకే ఆస్తుల అటాచ్లు, జప్తులు, షోకాజ్ నోటీసులు సాగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్రల్ని చిన్నమ్మ భగ్నం చేస్తారని పేర్కొన్నా, తాజా పరిణామాలు అమ్మ శిబిరాన్ని కలవరంలో పడేసి ఉండడం గమనార్హం. (చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్) -
చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపచేశారు. వీటిలో రూ 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. కాగా, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. చదవండి : చిన్నమ్మకు కొత్త చిక్కులు -
శశికళ పాత్రలో ప్రియమణి !
హైదరాబాద్ : కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ తలైవిలో జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి కనిపించనున్నట్టు సమాచారం. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో శశికళ పాత్ర ఎవరికి దక్కుతుందనేది మొదటి నుంచీ ఆసక్తికరంగా మారింది. శశికళ పాత్రకు ప్రియమణి సరిగ్గా సరిపోతారని భావించిన దర్శకుడు విజయ్ ఆమెను ఒప్పించినట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న తలైవిలో పాన్ ఇండియా అప్పీల్‌ను తీసుకువచ్చేందుకు ప్రియమణి ఎంట్రీ కలిసివస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. జయలలిత జీవితాన్ని శశికళ అధికంగా ప్రభావితం చేయడంతో మూవీలో ఈ పాత్ర కీలకంగా మారింది. కాగా ప్రియమణి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉండగా, ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సిరివెన్నెల మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తలైవి కంగనా
ఈ మధ్య కంగనా రనౌత్ పొలిటికల్ స్పీచ్‌లను ఎక్కువగా వింటున్నారు. అది కూడా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ప్రసంగాలను వింటున్నారట. అది మాత్రమే కాదు.. తన బాడీ లాంగ్వేజ్ జయలలితకు మ్యాచ్ అయ్యేలా వర్కవుట్ చేస్తున్నారు. ఆమెలా నడవడానికి, మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆమె పాత్రలో నటించనున్నారు కాబట్టి. కథానాయికగా మంచి పేరు తెచ్చుకుని, తమిళనాట రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరు గాంచిన జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏఎల్. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ చివర్లో మొదలు పెట్టాలనుకుంటున్నారు. ‘‘కాలేజీ చదువు ఆపేసి నటిగా రాణించాలని జయలలిత నిర్ణయం తీసుకున్నప్పటి సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ముందుగా మైసూర్లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత చెన్నై, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశాం. అలాగే కంగనా లుక్స్, బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించి వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. త్వరలో కంగనా లుక్ టెస్ట్ ప్లాన్ చేశాం. మంచి స్కిల్డ్ ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్టులను టీమ్‌లోకి తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ రచయితలు విజయేంద్ర ప్రసాద్, రజత్ అరోరా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు’’ అని చెప్పారు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శైలేష్ ఆర్. సింగ్. -
ఇందిర కోసం విమానం హైజాక్!
సాక్షి, లక్నో: 1981లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బోలానాథ్పాండే అతని స్నేహితుడు కలిసి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. ఇంతకీ వారి డిమాండ్ ఏమిటో తెలుసా..జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీని విడుదల చేయడం. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అనేక మంది ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టించారు. జైల్లోనే వారిని హతమార్చేందుకు కుట్రపన్నారన్న ఆరోపణపై ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అరెస్టు చేసింది. వారిని విడిచిపెట్టాలని డిమాండు చేస్తూ బోలానాథ్ ఈ హైజాక్‌కు పాల్పడ్డాడు. పోలీసులు కొన్ని గంటల్లోనే హైజాకర్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బొమ్మ ఆయుధాలతో వారు బెదిరించి హైజాక్‌కు పాల్పడ్డారని గుర్తించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బోలానాథ్కు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్టు కూడా ఇచ్చింది. బోలానాథ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు సలేంపూర్ టికెట్టు ఇచ్చింది. జయ.. ‘నాలుగాకులు’ ఎన్నికల్లో కొందరు నాయకులు ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేస్తుంటారు. రెండింటిలోనూ నెగ్గితే ఏదో ఒక దానికి రాజీనామా చేస్తారు.అయితే, 2001లో తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జయలలిత ఏకంగా నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. విచిత్రమేమిటంటే ఆ నాలుగు నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. టాన్సీ భూముల కుంభకోణంలో అప్పటికే జయలలితను దోషిగా ప్రకటించడంతో ఆమె ఎన్నికలకు అనర్హురాలయ్యారు. ఈ కారణంగా ఆమె నామినేషన్లను తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తు ‘రెండాకుల’పై జయలలిత అండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదక్కొట్టాయ్ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఒకే ఒక్కడు మొరార్జీ సాధారణంగా ఒక దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశీయుడికే ఇస్తారు. అప్పుడప్పుడు విదేశీయులకు కూడా ఇస్తుంటారు. భారతదేశానికి చెందిన ఒకే ఒక్కరు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందారు. ఆ ఘనత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కు దక్కింది. 1990, మే 19న ఆయనను పాకిస్తాన్ ప్రభుత్వం ‘నిషాన్ ఏ పాకిస్తాన్’ పురస్కారంతో సత్కరించింది. మొరార్జీ తర్వాత ఇంత వరకు మరే భారతీయుడికి ఆ గౌరవం లభించలేదు. భారత్–పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు, శాంతి స్థాపనకు మొరార్జీ చేసిన కృషికి గుర్తింపుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. ముఖ్యమంత్రి పేరిట డాక్టర్స్‌డే దేశంలో ఏటా జూలై 1న డాక్టర్స్‌డే (వైద్యుల దినోత్సవం) జరుపుకుంటాం. అయితే, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (బీసీరాయ్) జ్ఞాపకార్థం ఈ ‘డే’ జరుపుకోవడం విశేషం. సీఎం అయినప్పటికీ రాయ్ తన జీవితాన్ని వైద్యవృత్తికే అంకితం చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ ఏ ర్పాటులో కీలకపాత్ర పోషించారు. వైద్య రం గానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజైన జూలై 1ని డాక్టర్స్‌డేగా పాటిస్తున్నారు. అంతేకాక 1962లో ఆయన స్మారకార్థం బీజీ రాయ్ అవార్డును ఏర్పాటు చేశారు. మన దేశంలో వైద్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే. 1961లో రాయ్‌కు ‘భారతరత్న’ లభించింది. -
జయలలిత బయోపిక్ టైటిల్ ఇదే..
చెన్నై : తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్ మూవీ టైటిల్‌ను చిత్ర దర్శకుడు విజయ్ ఆదివారం ప్రకటించారు. తలైవి పేరిట ఈ బయోపిక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తామని చెప్పారు. జయలలిత బయోపిక్కు తలైవి టైటిల్ చక్కగా సరిపోతుందన్నారు. జయలలిత పేరు ప్రఖ్యాతులు, ఆమె సాధించిన అనూహ్య విజయాలు తనకు ఈ సినిమా రూపొందించే బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అవకాశాన్ని అంగీకరించేలా స్ఫూర్తిని రగిల్చాయని చెప్పుకొచ్చారు. నిజాయితీగా ఈ బయోపిక్‌ను తెరకెక్కించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నానని దర్శకుడు వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించి బాహుబలి కథారచయిత విజయేంద్ర ప్రసాద్ సహకారం తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
ద్రవిడ రత్నాలు
-
అధికారం కోసం అమ్మను పొట్టనపెట్టుకున్నారు..
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వైద్య చికిత్స అందకుండా శశికళ కుటుంబం అడ్డుకుందని, అధికారం చేజిక్కించుకునేందుకు జయలలిత మరణం కోసం వారు వేచిచూశారని ఏఐడీఎంకే ఆరోపించింది. అధికార దాహంతో అమ్మ(జయలలిత)కు తదుపరి చికిత్సను అందించకుండా, ఆమె మరణం కోసం శశికళ కుటుంబం వేచిచూసిందని పార్టీ అధికార పత్రిక నమదు అమ్మ పత్రిక పేర్కొంది. ప్రజల సొమ్ముతో శశికళ కుటుంబం కోట్లు గడించిందని ఆరోపించింది. 2016 డిసెంబర్లో జయలలిత మరణించిన వెంటనే శశికళ పార్టీ చీఫ్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే అవినీతి కేసులో ఆమె జైలు పాలవడంతో ఏఐఏడీఎంకేలో శశికళ ప్రస్ధానం ఎక్కువకాలం సాగలేదు. అనంతర పరిణామాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న నేతలు సైతం రెబెల్ నేత, ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం పక్షాన చేరారు. చివరికి పార్టీ అధికారిక చిహ్నం సైతం పన్నీర్, పళనిస్వామిల వశమైంది. -
జయ మరణం; ‘అమ్మ’ డ్రైవర్ కీలక సమాచారం
చెన్నై : దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌తో పాటు జయలలిత దగ్గర చాలాకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న కన్నన్‌ని వేర్వేరుగా విచారించింది. శశికళ, వైద్యుడు, కన్నన్ చెప్పిన అంశాలకు పొంతన లేదని తెలిపింది. శశికళ, శివకుమార్‌ల వర్షన్... ‘ఆ రోజు అనగా 2016, సెప్టెంబర్ 22న అమ్మ(జయలలిత) బెడ్‌పై కూర్చుని ఉంది. అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో డ్రైవర్ కన్నన్, జయ వ్యక్తిగత భద్రతా అధికారి ‘అమ్మ’ను బెడ్ మీద నుంచి వీల్ చైర్‌లోకి మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యపడలేదు. దాంతో రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్‌కు ఫోన్ చేసామని’ చెప్పారు. కన్నన్ చెప్పిన వివరాలు... ‘అమ్మ’ డ్రైవర్ కన్నన్ మాత్రం శశికళ, శివకుమార్‌లు చెప్పిన దానికి విరుద్ధమైన విషయాలు చెప్పాడని కమిషన్ వెల్లడించింది. కన్నన్ 1991 నుంచి జయలలిత దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కన్నన్ జయలలితను ఆస్పత్రిలో చేర్చిన రోజు జరిగిన సంఘటన గురించి కమిషన్‌తో చెప్పిన వివరాలు... ‘నేను ‘అమ్మ’ గదిలోకి వెళ్లేసరికి ఆమె చైర్లో కూర్చుని ఉన్నారు. అప్పటికే ‘అమ్మ’ స్పృహ కోల్పోయి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. పెన్ను కాప్ కూడా తీసి ఉంది. ‘చిన్నమ్మ’ నాతో వెంటనే వెళ్లి ఒక వీల్ చైర్ తీసుకు రా, అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పింది. కొంతసేపటి తరువాత నేను, పీఎస్ఓ వీరపెరుమాల్ చైర్ తీసుకువచ్చి, అమ్మను ఆ చైర్లో కూర్చొపెట్టాము. రెండడుగులు వేసామో, లేదో అమ్మ చైర్ నుంచి కింద పడింది. వెంటనే నేను, వీరపెరుమాల్ ‘అమ్మ’ను లేపడానికి ప్రయత్నించాము. కానీ మా వల్ల కాలేదు. దాంతో స్ట్రెచర్ తీసుకువస్తే బాగుంటుందని భావించామ’ని తెలిపాడు. గంట సేపు డాక్టర్ అదృశ్యం... అంతేకాక కన్నన్ చెప్పిన మరో ఆసక్తికర అంశమేంటంటే.. ‘నేను రాత్రి 8.30 గంటల సమయంలో డాక్టర్ శివకుమార్‌ను పోయెస్ గార్డెన్లో చూశాను. కానీ కొంతసేపటి తరువాత ఆయన బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఆయన తిరిగి ఎప్పుడు పోయెస్ గార్డెన్‌కి వచ్చాడో నాకు తెలియదు. కానీ నేను అమ్మ గదిలోకి వెళ్లినప్పుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. అంటే దాదాపు గంట తర్వాత అంటే 9.30 గంటలకు అతను తిరిగి వచ్చుంటాడని తెలిపాడు. అంతేకాక ‘ఆ రోజు(సెప్టెంబర్ 22) రాత్రి 10 గంటల ప్రాంతంలో కారును సిద్ధంగా ఉంచమని పీఎస్వో పెరుమాళ్‌కు చెప్పాను. అయితే లక్ష్మి (జయ ఇంట్లో పనిమనిషి) పెద్ద కారు అయితే బాగుంటుందని తనతో చెప్పింద’ని తెలిపాడు. అయితే కన్నన్ చెప్పిన ఈ రెండు విషయాలను శశికళ, శివకుమార్‌లు చెప్పలేదని కమిషన్ పేర్కొంది. అంతేకాక పోయెస్ గార్డెన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అయితే సెప్టెంబర్ 22 నాటి దృశ్యాలు అందులో రికార్డయ్యాయో, లేదో తనకు తెలియదని కన్నన్ కమిషన్‌తో చెప్పాడు. -
విప్లవ నాయకురాలిగా...
మహానటి సావిత్రి బయోపిక్ ఇటీవలే సిల్వర్ స్క్రీన్‌కి వచ్చింది. మరో అందాల అభినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రానుందనే వార్త షికారు చేస్తోంది. కథానాయికగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత జీవితం సెన్సేషన్. సినిమాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా కుటుంబ పరిస్థితుల కారణంగా నటి అయ్యారు జయలలిత. ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు... ఇలా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ప్రత్యర్థి పార్టీ నాయకుడితో ఢీ అంటే ఢీ అన్నారు. పురచ్చి తలైవి (విప్లవ నాయకురాలు) అనే పేరు తెచ్చుకున్నారు. ‘ఉక్కు మహిళ’ అనిపించుకున్న జయలలిత బయోపిక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈ విప్లవ నాయకురాలి పాత్ర చేయదగ్గ నాయిక ఎవరు? అంటే.. ‘విద్యాబాలన్’ కరెక్ట్ అనిపించిందట యూనిట్‌కి. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్’కి విద్యాబాలన్ పూర్తీగా న్యాయం చేశారు. ఇప్పుడు పవర్ఫుల్ లేడీ జయలలితగా జీవిస్తారని ఊహించవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. -
వెలుగులోకి ఆసుపత్రిలోని జయ ఆడియో క్లిప్పులు
-
వివాదాల ముసురు..!
దివంగత సీఎం జయలలిత తిరిగిరాని లోకానికి వెళ్లినా, వార్తల్లో వ్యక్తిగానే ఉన్నారు. అన్నాడీఎంకే వర్గాల తీరుతో ఆమె చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అసెంబ్లీలో కొలువుదీర్చిన అమ్మ ఫొటోపై వాదం చెలరేగింది. కోర్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు స్పీకర్ కోర్టులోకి బంతిని నెట్టారు. సాక్షి, చెన్నై : పురట్చితలైవిగా, అమ్మగా తమిళుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకురాలు జయలలిత. ఆమె మరణం అనంతరం అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాడీఎంకే పాలకుల పుణ్యమా అని తరచూ ఏదో ఒక రూపంలో అమ్మపై చర్చసాగుతూనే ఉంది. తమకు ఉన్న అధికారాలు ఉపయోగించి అసెంబ్లీలో అమ్మ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, వివాదం రగిల్చారు. అసెంబ్లీలో ఆమె విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదంటూ కోర్టులో ఓ వైపు పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో, దాన్ని ఉల్లంఘించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈ చిత్రపటం ఏర్పాటును వ్యతిరేకిస్తూ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. స్పీకర్ కోర్టులోకి బంతి ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగిన విచారణలో ఆ చిత్రపటం ఏర్పాటుకు వ్యతిరేకంగా పిటిషనర్ తరపున వాదనలు జోరుగా సాగాయి. ఆ వాదనల్ని పరిగణలోకి తీసుకున్నా, తాము అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేయడం గమనార్హం. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోమని, అసెంబ్లీలో స్పీకర్ నిర్వాకం వ్యక్తిగత ఇబ్బందులకు ఎవర్ని అయినా గురి చేస్తే, వాటిని విచారణకు తీసుకుంటామన్నారు. అందుకే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తాము విచారిస్తున్నామని గుర్తు చేశారు. చిత్రపటం అసెంబ్లీలో ఉండాలా..? వద్ద అనేది ప్రజలు తేలుస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇందుకు తగ్గ ఫలితాలు ప్రతిబింబిస్తాయని, అప్పుడు కొత్తగా వచ్చే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం. విగ్రహంపై చర్చ రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జయలలిత విగ్రహంలో ఆమె ఛాయలు లేవనే మరో చర్చకు తెరతీసింది. దీంతో ఆ పార్టీ ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రి ఎస్పీ వేలుమణి కూడా అమ్మ విగ్రహంలో మార్పులకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. తక్కువ సమయంలో తయారీ కాగా, అమ్మ విగ్రహం తయారు చేసినఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిల్పి ప్రసాద్ స్పందించారు. విగ్రహం తయారీకి కొద్దిరోజుల క్రితం ఆర్డర్ ఇచ్చారన్నారు. తక్కువ సమయం కావడంతో సోదరుడు కామధేను ప్రసాద్, సిబ్బందితో రేయింబవళ్లు శ్రమించి, మొదట బంకమట్టితో విగ్రహాన్ని సిద్ధం చేసినప్పుడు ఎలాంటి అనుమానం కలగలేదన్నారు. విగ్రహం తయారయ్యాక పలు కోణాల్లో ఫొటోలు తీసి అన్నాడిఎంకే వర్గాలకు పంపించామన్నారు. వారు కూడా ఆక్షేపణ చెప్పలేదన్నారు. దీంతో తుది మెరుగులు దిద్ది చెన్నైకు తీసుకువచ్చామన్నారు.ఆ విగ్రహంలో అమ్మ ఛాయలు లేవనే విమర్శలు వస్తున్నందున తామే సరిదిద్దుతామన్నారు. ఇప్పటికి ఎన్నో విగ్రహాలు తయారు చేసినా, పొరబాట్లు జరగలేదన్నారు. ఈ విగ్రహాన్ని సొంత ఖర్చుతో మార్పు చేస్తామని స్పష్టం చేశారు. నన్ను అకారణంగా తొలగించారు ఆ తరువాత అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అన్నాకార్మిక సంఘం నేత చిన్నస్వామి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇది వ్యక్తిగతం కావడంతో విచారణకు స్వీకరిస్తూ, వివరణ ఇవ్వాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఓ పన్నీరు సెల్వం, ఉపాధ్యక్షుడు పళని స్వామి, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి రెండో తేదీకి వాయిదా వేశారు. -
1600మంది ఖైదీలకు విముక్తి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్, జయలలితల జయంతి సందర్భంగా తమిళనాడు జైళ్లలోని 1,600 మంది యావజ్జీవ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించనున్నది. ఎంజీఆర్ జయంత్యుత్సవాలను ఈనెల 17వ తేదీన, వచ్చే నెల 25న జయలలిత జయంతిని నిర్వహించనున్నారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో పదేళ్లకుపైగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని జైళ్లలోని జాబితాను కలుపుకుంటే 1,900 మంది ఖైదీల విడుదలకు జైళ్లశాఖ నుంచి సిఫార్సులు అందాయి. వీరిలో 1,600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అన్నాడీఎంకే అసలు సారథి శశికళే
-
అపోలో ఆసుపత్రిలో జయ వీడియో
-
అమ్మ లేని పార్టీ..!
-
జయలలిత డెత్ మిస్టరీ: న్యాయవిచారణకు ఆదేశం
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు రంగంలోకి దిగింది. జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత ఏడాది డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. జయలలిత మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా, జయలలిత మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాల్సిందేనని ఆమె వీరవిధేయుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత మృతిపై న్యాయవిచారణకు ఆదేశించింది. -
తమిళనాట ముగియని రాజకీయ సంక్షోభం
-
చిన్నచిన్న నిజాలైనా చెప్పరా?
అక్షర తూణీరం ప్రజకు నిజాలు ఎలా తెలుస్తాయ్? ఎవరు చెబుతారన్నది పెద్ద ప్రశ్న. స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఏ మేరకు వచ్చిందో కచ్చితంగా చెప్పేదెవరు? తెలుగు రాష్ట్రాలలో రైతుల రుణమాఫీ జరిగిందా, జరుగు తోందా, జరగనుందా? జరిగితే ఏ మేరకు? అనే సత్యాన్ని అంకెలతో చెప్పే హరిశ్చంద్రుడెవరు? ప్రజలకు అందుతున్న రకరకాల పింఛన్లు ముట్టచెబుతున్నది కేంద్రమా? లేక చంద్రన్నలా? స్పష్టంగా విశదపరిచేదెవరు? శరన్నవరాత్రి ఉత్సవాలలో వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ మొక్కులు, ముడుపులు చెల్లించారు. ఆయన మోయలేనంత బరువు బంగారు నగలు. ‘‘మొక్కిన మొక్కులు చల్లంగుండి తెలంగాణ నా చేతికి వస్తే- బంగారు తొడుగేయించెదనమ్మా అని ఆనాడాయన మొక్కారు. ఈనాడు తీర్చారు.’’ ఒక పెద్దావిడ ఆ నగల సమర్పణ దృశ్యం చూసి ఆనందబాష్పాలు రాల్చి, ఇవన్నీ ఎవరి పైసలతో చెల్లిస్తున్నాడని అడిగింది. ‘‘ఎవరివైతేనేమి అవ్వా’’ అంటిని. అది సరేలే, మా దొరకి మీ, మా వెత్తాసం లేదు గాని, పున్యంలో నాకు వాటా వస్తదో లేదో తేలాలి గదా అన్నది. అది పబ్లిక్ మనీతో చేయించారా, సొంత సొమ్ముతో కావించారా అనేది అవ్వ ధర్మసందేహం. అది సొంత మొక్కు కాబట్టి, జేబు డబ్బుల్లోంచే కైంకర్యం చేసి ఉంటారని కొందరం టున్నారు. ‘‘అసలీ చిన్న వ్యవహారానికి ఇంతగా జనం తర్జనభర్జన పడాలా, తేల్చి చెప్పవచ్చు గదా’’ అనేది అవ్వల నిశ్చితాభిప్రాయం. ‘‘ఇదిగో, తల్లీ! భద్రకాళీ ప్రజల అభీష్టం మేరకు నేకోరిన వరం ఇచ్చినందుకు ప్రజాధనంతో నీకు సొమ్ములు సమర్పిస్తున్నా’’ అని స్పష్టంగా చెప్పచ్చునేమో అని మరికొందరు నోళ్లు నొక్కు కుంటున్నారు. ఈమధ్య మనదేశంలో ప్రతిదీ సస్పెన్స్‌గానే ఉంటోంది. ఎందుకో తెలియదు. జయలలిత ఒంట్లో బాగాలేదన్నది మాత్రమే మనకి తెలుసు. ఎంత బాగాలేదో, ఎట్లా బాగాలేదో ఎవ్వరూ చెప్పరు. ఎందరో వస్తారు. ఆసుపత్రికి వెళ్లొస్తుంటారు. పరామర్శించా మంటారు. వైద్య నిపుణులను కలసి ట్రీట్మెంట్ వివరాలు చర్చించామంటారు. దాదాపు నాలుగు వారా లుగా ఇదే దృశ్యం నడుస్తోంది. కాకపోతే పాత్రలు మారుతున్నాయి. వైద్య నిపుణుల నుంచి కూడా అంద రికీ అర్థమయ్యే రీతిలో బులెటిన్ రానేలేదు, చిదంబర రహస్యంలా. వీఐపీలంతా వస్తున్నారు, తిలకించి వెళు తున్నారు. కొన్ని గోప్యంగా ఉంచడం మంచిదేగానీ వాటికి హద్దులుండాలి. సమాచార వ్యవస్థలు, వందలాది శాటిలైట్లు చిన్న గోడ వెనుక సత్యాన్ని చెప్ప లేకపోతున్నాయి. ప్రజా క్షేమం దృష్ట్యా, దేశ ఆరోగ్యం దృష్ట్యా కొన్ని సార్లు పారదర్శక సూత్రా లను పక్కన పెట్టాల్సిందే. ఇట్లాంటప్పుడు అన్ని వ్యవస్థలు ఎట్లా ఉన్నా సమాచార వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యాలి. కొన్ని నిజాలను ప్రజకు చెప్పి, ఫోర్త్ ఎస్టేట్‌లో నిజాయితీ ఉందని నిరూపించుకోవాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నేడు చెన్నైకి లండన్ వైద్యులు
-
బాంబు పేల్చిన జయ సన్నిహితురాలు
-
ఏలూరులో అమ్మ గ్రైండర్లు
ఏలూరు: ఏలూరులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటింటికి ఇచ్చిన గ్రై ండర్లు ఏలూరులో దర్శనమిచ్చాయి. తమిళనాడులో గ్రౌండర్లు ఉన్నవారు,మనకెందుకులే అనుకున్నవాళ్ళు అమ్మేస్తే తీసుకువచ్చి ఇలా ఏలూరులో అమ్ముతున్నట్లు నెల్లూరుకు చెందిన చంద్రం తెలిపాడు. ఈ గ్రైండర్లు షాపుల్లో సుమారు రూ. 2 వేలకు పైగానే అమ్ముతున్నారని, ఇక్కడ రూ. 1500లకే అమ్ముతున్నట్లు చెప్పారు. తక్కువ ధరకు దొరుకుతుండటంతో ప్రజలు కొనడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. -
సందిగ్దంలో తమిళ అమ్మ