![Kangana Ranaut Act On jayalalitha Biopic Movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/29/889.jpg.webp?itok=ZThCAlZ3)
ఈ మధ్య కంగనా రనౌత్ పొలిటికల్ స్పీచ్‌లను ఎక్కువగా వింటున్నారు. అది కూడా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ప్రసంగాలను వింటున్నారట. అది మాత్రమే కాదు.. తన బాడీ లాంగ్వేజ్ జయలలితకు మ్యాచ్ అయ్యేలా వర్కవుట్ చేస్తున్నారు. ఆమెలా నడవడానికి, మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆమె పాత్రలో నటించనున్నారు కాబట్టి. కథానాయికగా మంచి పేరు తెచ్చుకుని, తమిళనాట రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరు గాంచిన జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏఎల్. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు.
ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ చివర్లో మొదలు పెట్టాలనుకుంటున్నారు. ‘‘కాలేజీ చదువు ఆపేసి నటిగా రాణించాలని జయలలిత నిర్ణయం తీసుకున్నప్పటి సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ముందుగా మైసూర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత చెన్నై, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశాం. అలాగే కంగనా లుక్స్, బాడీ లాంగ్వేజ్‌కి సంబంధించి వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. త్వరలో కంగనా లుక్ టెస్ట్ ప్లాన్ చేశాం. మంచి స్కిల్డ్ ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్టులను టీమ్‌లోకి తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ రచయితలు విజయేంద్ర ప్రసాద్, రజత్ అరోరా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు’’ అని చెప్పారు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శైలేష్ ఆర్. సింగ్.
Comments
Please login to add a commentAdd a comment