
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రతో తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా చిత్రంగా తలైవి సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా తలైవి చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది.
మొదటి భాగంలో జయలలిత నట జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు ఉంటుందని, రెండో భాగంలో సీఎంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అంతిమయాత్ర వరకు సాగుతుందని సమాచారం. దీని గురించి తలైవి చిత్రానికి మాటలు అందిస్తున్న మదన్ కార్గీ ట్విట్టర్‌లో పేర్కొంటూ జయలలిత గురించి రజనీకాంత్ కొన్ని విషయాలను చెప్పారని, తలైవి చిత్రానికి రెండో భాగం రూపొందిస్తే అందులో ఆయన చెప్పిన విషయాలను పొందుపరిచే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment