
చెన్నై : తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆమె జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్ మూవీ టైటిల్‌ను చిత్ర దర్శకుడు విజయ్ ఆదివారం ప్రకటించారు. తలైవి పేరిట ఈ బయోపిక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తామని చెప్పారు. జయలలిత బయోపిక్‌కు తలైవి టైటిల్ చక్కగా సరిపోతుందన్నారు.
జయలలిత పేరు ప్రఖ్యాతులు, ఆమె సాధించిన అనూహ్య విజయాలు తనకు ఈ సినిమా రూపొందించే బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన అవకాశాన్ని అంగీకరించేలా స్ఫూర్తిని రగిల్చాయని చెప్పుకొచ్చారు. నిజాయితీగా ఈ బయోపిక్‌ను తెరకెక్కించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నానని దర్శకుడు వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించి బాహుబలి కథారచయిత విజయేంద్ర ప్రసాద్ సహకారం తీసుకుంటామని చెప్పారు. కాగా, ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment