సినీ, టీవీ నటి జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా వెండితెరపై మెప్పించిన ఆమె నెగిటివ్, కమెడియన్, గ్లామర్ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందారు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసిన ఆమె కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత జంబలకిడి పంబా, ఆ ఒక్కటి అడక్కు వంటి సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశారు. అందాల తారగానూ గుర్తింపు పొందిన ఆమె స్టార్ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ సెటిలైన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగుల వేశారు.
చదవండి: మై స్వీట్ బ్రదర్ అంటూ ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్
అయితే ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన వారం రోజులకే భర్త నిజస్వరూపం భయపడింది. అతడి వేధింపులు తట్టుకోలేక ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకున్నట్లు గతంలో ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. తాజాగా ఆమె పాత వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఓ మూవీ సమయంలో వినోద్‌తో పరిచయం ఏర్పడింది. ఓ సంఘటనలో ఆయన నన్ను సేవ్ చేశాడు. దీంతో అతడికి కనెక్ట్ అయ్యాను. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. కానీ ఆయనను పెళ్లి చేసుకోవద్దని సీనియర్ నటుడు చలపతి రావు, ప్రొడ్యూసర్ జయకృష్ణగారు నన్ను హెచ్చరించారు.
ఇక పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే చచ్చిపోతానంటూ ఆయన నన్ను బ్లాక్‌మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతానన్నాడు. దాంతో నా మనసు కరిగి పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో వాళ్లు ఆయనతో పెళ్లికి అసలు ఒప్పుకోలేదు. దీంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న. ఇష్టం లేకపోయిన మా వాళ్లు ఆ పెళ్లికి వచ్చారు. అయితే కట్నం ఇవ్వడానికి నా పుట్టింట వాళ్లు ఓ అగ్రిమెంట్ రాయించుకున్నారు. పిల్లలు పుట్టాకే నాకు చెందాల్సిన ఆస్తి ఇస్తామంటూ బాండ్ పేపర్‌పై నాతో సంతకం చేయించుకున్నారు. పెళ్లయిన వారం రోజులకు ఇది ఆయనకు తెలిసింది. దీంతో నువ్వు ఎందుకు సంతకం చేశాడు.. ఆ బాండ్ క్యాన్సిల్ చేసుకోమంటూ నన్ను వేధించాడు.
చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు
ఇక అప్పుడే అర్థమైంది ఆస్తి కోసమే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడని. అలా మూడు నెలలు పంటికింద బాధలను భరించాను. ఆ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక నీకు నాకు సెట్ అవ్వదు విడిపోదామని చెప్పా. ఏడాది కాకముందే విడిపోయాం. చివరి రోజుల్లో ఆయన నన్ను ఇంట్లో బంధించాడు. యాసిడ్ పోస్తా, చంపేస్తానంటూ చాలా వేధించాడు. నన్ను హౌజ్ అరెస్ట్ చేస్తే చలపతి రావు గారు, గోపాలకృష్ణ నన్ను ఆ ఇంటి నుంచి విడిపించారు. వారే లేకపోతే ఆ ఇంటిలోనే నేను ఏమైపోయేదాన్నో’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి గతంలో జయలలిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment