ఏలూరులో అమ్మ గ్రైండర్లు
Published Sat, Oct 8 2016 6:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
ఏలూరు: ఏలూరులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటింటికి ఇచ్చిన గ్రై ండర్లు ఏలూరులో దర్శనమిచ్చాయి. తమిళనాడులో గ్రౌండర్లు ఉన్నవారు,మనకెందుకులే అనుకున్నవాళ్ళు అమ్మేస్తే తీసుకువచ్చి ఇలా ఏలూరులో అమ్ముతున్నట్లు నెల్లూరుకు చెందిన చంద్రం తెలిపాడు. ఈ గ్రైండర్లు షాపుల్లో సుమారు రూ. 2 వేలకు పైగానే అమ్ముతున్నారని, ఇక్కడ రూ. 1500లకే అమ్ముతున్నట్లు చెప్పారు. తక్కువ ధరకు దొరుకుతుండటంతో ప్రజలు కొనడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.
Advertisement
Advertisement