
మహానటి సావిత్రి బయోపిక్ ఇటీవలే సిల్వర్ స్క్రీన్‌కి వచ్చింది. మరో అందాల అభినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రానుందనే వార్త షికారు చేస్తోంది. కథానాయికగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత జీవితం సెన్సేషన్. సినిమాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా కుటుంబ పరిస్థితుల కారణంగా నటి అయ్యారు జయలలిత. ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు... ఇలా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ప్రత్యర్థి పార్టీ నాయకుడితో ఢీ అంటే ఢీ అన్నారు. పురచ్చి తలైవి (విప్లవ నాయకురాలు) అనే పేరు తెచ్చుకున్నారు. ‘ఉక్కు మహిళ’ అనిపించుకున్న జయలలిత బయోపిక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే ఈ విప్లవ నాయకురాలి పాత్ర చేయదగ్గ నాయిక ఎవరు? అంటే.. ‘విద్యాబాలన్’ కరెక్ట్ అనిపించిందట యూనిట్‌కి. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ‘డర్టీ పిక్చర్’కి విద్యాబాలన్ పూర్తీగా న్యాయం చేశారు. ఇప్పుడు పవర్‌ఫుల్ లేడీ జయలలితగా జీవిస్తారని ఊహించవచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment