మంద కృష్ణ మాదిగను కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతోపాటు 11 మంది నాయకులను రాంగోపాల్‌పేట్ పోలీసులు బుధవారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 11వ ఏసీఎం జడ్జి ముందు హాజరుపరిచారు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపై విచారణ జరిపారు.
అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాద నలు జరగనున్నట్లు కృష్ణమాదిగ తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు వద్ద కృష్ణ మాదిగను కలిసేందుకు ప్రయత్నించిన టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులును పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మరోసారి మోసగిస్తున్నారని విమర్శించారు. కృష్ణ మాదిగపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణను బేషరతుగా విడుదల చేయాలి
ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ డిమాండ్
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణను వెంటనే విడుదల చేయాలని ఆ సమితి జాతీయ కమిటీ డిమాండ్ చేసింది. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించింది. ఎమ్మార్పీఎస్ నేతల అరెస్టు నేపథ్యంలో జాతీయ కమిటీ నేతలు ఉసురుపాటి బ్రహ్మయ్య, మందకుమార్, నకిరకంటి యాదయ్య, తీగల ప్రదీప్ తదితరులు బుధవారం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్ సందర్భంగా కేసీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులను మించి నిరంకుశంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
మందకృష్ణను విడుదల చేయాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే శనివారం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment