చెడు ఆలోచనలే విషక్రిములు | Bad idea toxins | Sakshi
Sakshi News home page

చెడు ఆలోచనలే విషక్రిములు

Published Tue, Jan 13 2015 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

Bad idea toxins

అదనపు జిల్లా జడ్జి ఆర్.మురళి
 
విజయవాడ లీగల్ :  చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములని  అదనపు జిల్లా జడ్జి ఆర్.మురళి అన్నారు. నగరంలోని  సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసి యేషన్(బీబీఏ)హాలులో స్వామివివేకానంద 152వ  జయంత్యుత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జడ్జి మురళి మాట్లాడుతూ ప్రతీది తనకే కావాలనే వాడు స్వార్థపరుడన్నారు.  రామకృష్ణ పరమహంస ముఖ్య అనుచరుడుగా వివేకానంద మంచి గుర్తింపు పొందారన్నారు. బీబీఏ అధ్యక్షుడు సంపరదుర్గ శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి వివేకానందుడన్నారు. మానవసేవే మాధవసేవని, మతం అంటే మానవత్వమని చెప్పారు. యువత శక్తికి ప్రతిబింభమన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాది జి.మురళీమోహన్‌రావు,  బీజేపీ నేత వి.శ్రీనివాసరాజు, బీబీఏ ప్రధాన కార్యదర్శి వజ్జే వెంకట రవికుమార్, వివేకానంద సేవాసమితి కన్వీనర్ పి.డి.సత్యనారాయణ ప్రసంగించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్ర పటానికి జడ్జి మురళి, బీబీఏ ప్రతినిధులు  పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఎం.జయప్రకాష్, కొఠారి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, పిళ్ళా రవి,   వై.డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుడు స్వామి వివేకానంద : నవనీతం

 గాంధీనగర్ :  భారత ప్రాచీన నాగరికతను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు. హనుమాన్‌పేటలోని దాసరి నాగభూషణరావు భవన్ వద్ద స్వామి వివేకానంద 152వ జయంతి, జాతీయ యువజన దినోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఏఐవైఎఫ్ కార్యకర్తలు తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఏఐవైఎఫ్ కార్యకర్తలు లంకా గోవిందరాజులు, సయ్యద్ అప్సర్, కనకాంజనేయులు, డి.సూరిబాబు, తమ్మిన గణేష్, కె.వి.రామారావు, నరసింహారావు, మొహిద్దీన్, శ్రీను, లక్ష్మణరావు, రాయప్ప, విజయప్రసాద్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement