
విద్యార్థుల ముందు పీఈటీ మద్యపానం
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్‌లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్‌లో గొడవ పెట్టుకున్నాడు.
పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment