'లింగా'కు సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ | Rajinikanth- Lingaa release issue:civil court orders | Sakshi
Sakshi News home page

'లింగా'కు సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ

Published Thu, Dec 11 2014 2:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

'లింగా'కు సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ

'లింగా'కు సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ

చెన్నై : రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'లింగా' చిత్రానికి సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తమ కథను లింగా చిత్ర దర్శకుడు, రచయిత కాపీ కొట్టారంటూ రవిరత్నం అనే చిత్ర నిర్మాత వేసిన పిటిషన్పై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. శుక్రవారం మధ్యాహ్నం లోగా రూ.10 కోట్లు న్యాయస్థానానికి కట్టి సినిమా విడుదల చేసుకోవచ్చని ఆదేశించింది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం  ప్రపంచవ్యాప్తంగా 'లింగా' విడుదల కానుంది. కోర్టు ఆదేశాన్ని తాము గౌరవిస్తామని లింగా చిత్ర నిర్మాత రాక్లైన్ వెంకటేష్ తెలిపారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ అనుకున్నట్లుగానే విడుదల అవుతుందని ఆయన చెప్పారు.

రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించిన  ఈ చిత్రానికి కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సెన్సార్ బోర్డ్  'యు'  సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 థియేటర్లలో విడుదల కానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో  రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement