- ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయన్న కోర్టు
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సిటీ సివిల్ కోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఓట్లను లెక్కించరాదని, ఎన్నికల ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. మా ఎన్నికల నిర్వహణ తీరును సవాల్ చేస్తూ ఎన్నికల్లో పోటీచేస్తున్న కళ్యాణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆదివారం జరగబోయే ఎన్నికలను ఆపాలని కోరారు.