MAA election
-
అన్ని ప్రశ్నలకు సమాధానం మా ఎన్నికలే: నరేష్
-
జీవితపై చర్యలు తీసుకోవాలంటూ పృథ్వీ ఫిర్యాదు
-
MAA Elections 2021: మహామహులను రంగంలోకి దింపనున్న విష్ణు
-
'మా' ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్
-
Maa ఎన్నికల తేదీ ఖరారు అయ్యే అవకాశం
-
‘మా’ఎన్నికల్లో నరేశ్ కొత్త ప్రతిపాదన
-
‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి
‘‘మార్చిలో ‘మా’ ఎలక్షన్స్ జరపండి. ఏప్రిల్‌లో చార్జ్ తీసుకోండి అని బై లాలో ఉంది. ఇదే లాయర్‌కు చెప్పాను. ‘ఇన్నిరోజులు ఆగాలా? అప్పటి వరకు అతనే పదవి అనుభవిస్తాడా?’ అన్నారు. జనరల్ బాడీలో మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్మీట్లు పెట్టొద్దు. పని చేద్దాం. ‘మా’ను రోడ్డు మీదకు లాగకండి’’ అని శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎలక్షన్స్‌లో నరేశ్ అధ్యక్షడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్త ప్యానెల్ ప్రమాణ స్వీకారానికి శివాజీ రాజా అడ్డుపడుతున్నారని ఓ ప్రెస్మీట్లో నరేశ్ అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివాజీరాజా మాట్లాడుతూ – ‘‘22 ఏళ్లుగా ‘మా’లో నేను చేయని పదవి లేదు. ‘మా’ డబ్బులతో ఒక్క టీ తాగలేదు నేను. సడన్‌గా వచ్చి, ఫైల్లో ఏదో తప్పు ఉందంటారు. తప్పు చేసినట్లు ఉంటే శిక్ష అనుభవిస్తాను. గోల్డేజ్ హోమ్ అనే నా కలపై నీళ్లు చల్లారు. ఎవరూ లేని వ్యక్తి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి గోల్డేజ్హోమ్ పేరుతో బిల్డింగ్ కట్టిస్తే పేరు అంతా వీడికే వచ్చేస్తుంది అనుకున్నవారి కుట్రలో బలైపోయాను. మీరు కట్టండి. గ్రేట్ అని ఒప్పుకుంటా. ‘శివాజీ.. నువ్వు పడుతున్న కష్టం చూశాను. కేటీఆర్‌గారితో మాట్లాడి మీకు సైట్ ఇప్పిస్తా’నని 24గంటల్లో కేటీఆర్‌గారితో చిరంజీవిగారు మాట్లాడారు. ఎలక్షన్కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. ఆ సైట్ వచ్చి ఉంటే నా కల సాకారం అయ్యేది. ప్రతి ఏడాది ‘మా’ డైరీ నేను వేస్తాను. కానీ ఈ ఏడాది నరేశ్‌గారు కమిటీ పెట్టాను. డైరీ నేను వేస్తాను అన్నారు. డైరీకి 14 లక్షల 20వేలు వచ్చిందని చెప్పారు. అకౌంట్లో 7లక్షలే పడ్డాయి. మిగతా డబ్బులు ఏమైపోయాయి? అకౌంట్స్ అప్పజెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది’’ అన్నారు. -
‘మా’ అధ్యక్ష బరిలో నరేష్
సాక్షి, హైదరాబాద్ : ఈ నెల (మార్చి)10న జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 2019-21 ఎన్నికల్లో అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ పోటీ చేయనున్నారు. శనివారం ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నటుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ లో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఎన్నికలు వెళ్తున్నామని చెప్పారు. లక్షల రూపాయలు డొనేట్ చేసే తమ కుటుంబం నుంచి ఒక్కసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది అడగడంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో టర్మ్ అధ్యక్షుడుగా చేద్దామని శివాజీ రాజా అన్నారన్నారు. అందుకే ఈ సారి తాను పోటీకి దిగానని తెలిపారు.కోశాధికారిగా కోటా శంకర్ రావును పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ‘మా’ సరిగా పని చేయడం లేదు : రాజశేఖర్ ‘మా’ అసోసియేషన్ సరిగా పనిచేయడంలేదని ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆరోపించారు. నరేష్ నిజాయితీ మెచ్చే ఈ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నామని చెప్పారు. ప్రేమగా పని చేయడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ‘మా’ లో ఆడవాళ్లకు కీలక పదవులు లేవని జీవిత రాజశేఖర్ విమర్శించారు. ఈసారి స్వతంత్రంగా పోటీ చేద్దామనుకున్నానని, కానీ నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీగా పోటీ చేయమని కోరడంతో అంగీకరించామన్నారు. పనిచేసే వాళ్లకే సభ్యులు ఓట్లు వెయ్యాలని కోరారు. -
సమసిపోని 'మా' ఎన్నికల వివాదం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం ఇంకా సమసిపోలేదు. 'మా' ఎన్నికలపై నటుడు ఓ.కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగా ఎన్నికైన మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 'మా' ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ - ఆ తరువాత వాడీవేడీ విమర్శలతో ఎన్నికలు జరగడం తెలిసిందే. మార్చి 29న ఎన్నికలు జరిగినా కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. ఆ తరువాత కోర్టు అనుమతితో ఏప్రిల్ 17న ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. సమీప ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. కొత్తగా అధ్యక్షుడుగా ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 19న ప్రమాణస్వీకారం కూడా చేశారు. మళ్లీ ఇప్పుడు నటుడు ఓ.కళ్యాణ్ 'మా' ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేయడంతో రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, శివాజీ రాజాలకు నోటీసులు జారీ అయ్యాయి. -
'జయసుధ ఓటమి బాధ కలిగించింది'
హైదరాబాద్: మా అధ్యక్ష ఎన్నికలలో జయసుధ ఓటమి తనకు బాధ కలిగించిందని ప్రముఖ నటి మంచు లక్ష్మీ అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా మహిళ పోటీ చేస్తుందన్న కరణంగానే ఆమెకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. మా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని మంచు లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు. సినీ కార్మికుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంచు లక్ష్మీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మా అధ్యక్ష ఎన్నికలు మార్చి 29న జరిగాయి. ఈ ఎన్నికల్లో జయసుధపై రాజేంద్ర ప్రసాద్ 85 ఓట్లతో ఘన విజయం సాధించగా... మా ఉపాధ్యక్షులుగా ప్రముఖ నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మా ఎన్నికల సందర్భంగా జయసుధ ప్యానెల్ కు ఎం. మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మీ మద్దతు ఇచ్చిన విషయం విదితమే. -
అలీపై శివాజీరాజా గెలుపు
-
‘మా’ ఎన్నికలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్
ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయన్న కోర్టు సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సిటీ సివిల్ కోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఓట్లను లెక్కించరాదని, ఎన్నికల ఫలితాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. మా ఎన్నికల నిర్వహణ తీరును సవాల్ చేస్తూ ఎన్నికల్లో పోటీచేస్తున్న కళ్యాణ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆదివారం జరగబోయే ఎన్నికలను ఆపాలని కోరారు. -
'మా' ఎన్నికలపై కోర్టులో పిటిషన్:రేపు వాదనలు
హైదరాబాద్: 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)ఎన్నికలు ఆపాలంటూ నటుడు ఓ కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసోసియేషన్ బైలాస్కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఎలక్షన్ ఆఫీసర్లను మార్చాలని ఆయన కోరారు. 2,500 రూపాయలు ఉన్న నామినేషన్ ఫీజును పది వేల రూపాయలకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై రేపు కోర్టులో వాదనలు జరుగుతాయి.