సాక్షి, హైదరాబాద్ : ఈ నెల (మార్చి)10న జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 2019-21 ఎన్నికల్లో అధ్యక్షుడిగా సీనియర్ నటుడు నరేష్ పోటీ చేయనున్నారు. శనివారం ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నటుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ లో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఎన్నికలు వెళ్తున్నామని చెప్పారు. లక్షల రూపాయలు డొనేట్ చేసే తమ కుటుంబం నుంచి ఒక్కసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది అడగడంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో టర్మ్ అధ్యక్షుడుగా చేద్దామని శివాజీ రాజా అన్నారన్నారు. అందుకే ఈ సారి తాను పోటీకి దిగానని తెలిపారు.కోశాధికారిగా కోటా శంకర్ రావును పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
‘మా’ సరిగా పని చేయడం లేదు : రాజశేఖర్
‘మా’ అసోసియేషన్ సరిగా పనిచేయడంలేదని ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆరోపించారు. నరేష్ నిజాయితీ మెచ్చే ఈ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నామని చెప్పారు. ప్రేమగా పని చేయడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ‘మా’ లో ఆడవాళ్లకు కీలక పదవులు లేవని జీవిత రాజశేఖర్ విమర్శించారు. ఈసారి స్వతంత్రంగా పోటీ చేద్దామనుకున్నానని, కానీ నరేష్ వచ్చి జనరల్ సెక్రటరీగా పోటీ చేయమని కోరడంతో అంగీకరించామన్నారు. పనిచేసే వాళ్లకే సభ్యులు ఓట్లు వెయ్యాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment