'జయసుధ ఓటమి బాధ కలిగించింది'
హైదరాబాద్: మా అధ్యక్ష ఎన్నికలలో జయసుధ ఓటమి తనకు బాధ కలిగించిందని ప్రముఖ నటి మంచు లక్ష్మీ అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా మహిళ పోటీ చేస్తుందన్న కరణంగానే ఆమెకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. మా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని మంచు లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు.
సినీ కార్మికుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంచు లక్ష్మీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మా అధ్యక్ష ఎన్నికలు మార్చి 29న జరిగాయి. ఈ ఎన్నికల్లో జయసుధపై రాజేంద్ర ప్రసాద్ 85 ఓట్లతో ఘన విజయం సాధించగా... మా ఉపాధ్యక్షులుగా ప్రముఖ నటుడు శివకృష్ణ, మంచు లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మా ఎన్నికల సందర్భంగా జయసుధ ప్యానెల్ కు ఎం. మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మీ మద్దతు ఇచ్చిన విషయం విదితమే.