'మా' ఎన్నికల కేసు విచారణ ఏప్రిల్ 7కి వాయిదా | MAA elections: case Verdict adjourned on april 7th | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికల కేసు విచారణ ఏప్రిల్ 7కి వాయిదా

Published Tue, Mar 31 2015 11:22 AM | Last Updated on Thu, Aug 9 2018 6:44 PM

MAA elections: case Verdict adjourned on april 7th

హైదరాబాద్ : మా' ఎన్నికల ఫలితాల పిటిషన్పై విచారణను సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలు జరిగిన తీరును వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు మంగళవారం కోర్టుకు సమర్పించారు. కాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు  ఈనెల 29న జరిగిన విషయం తెలిసిందే.  అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఇందులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement