సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. విభజనతో నష్టపోయిన రాయలసీమకు న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులను, వారి ఉద్యమాలను అణచడానికి ప్రయత్నిస్తోందని మండి పడ్డారు. రాయలసీమకు చెందిన తెలుగుదేశం ప్రజాపతినిధులు దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని న్యాయవాద సంఘం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నా, పట్టించుకోవట్లేదని విమర్శించారు. దీనికి త్వరలోనే తగిన ఫలితం అనుభవిస్తారని న్యాయవాద సంఘం నేతలు హరినాథరరెడ్డి, రామ్‌కుమార్, రాజారెడ్డి అన్నారు
బాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు :
ఆంధ్రపద్రేశ్ ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. ఏయే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందో కూడ సీఎంకు తెలియకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలౌతోందని తెలియచేశారు. ఏరాష్ట్రంలోనైనా హోదాను చట్టంలో పెట్టినట్లు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment