సాక్షి,అనంతపురం:కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ విషయమై శుక్రవారం(నవంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి. చంద్రబాబు రైతు ద్రోహి. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతంతో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రే. పోలవరం ఎత్తు 45.72 అడుగుల నుంచి 41 అడుగులకు కుదించాలని నిర్ణయించడం ద్రోహమే.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ గతంలో బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు’అని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు.
ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment