హైదరాబాద్: న్యాయవాదుల ఆందోళన కారణంగా ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయంలో బుధవారం ఉదయం లాయర్లు రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు న్యాయవాదులను ఆందోళన విరమింపజేసేందుకు యత్నిస్తున్నారు.