సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో విషాదకర ఘటన నెలకొంది. ఓ సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలిపడిపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ భవనానికి సంబంధించి సెల్లార్ తవ్వుతున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలిపడిపోయాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుతున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అనంతరం, ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, మృతులను బీహార్‌కు చెందిన వారికిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment