నాంపల్లిలో యుద్ధ వాతావరణం | lawyers protest at nampally criminal court | Sakshi
Sakshi News home page

నాంపల్లిలో యుద్ధ వాతావరణం

Published Mon, Jun 27 2016 12:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

lawyers protest at nampally criminal court

హైదరాబాద్: న్యాయవాదుల రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంది. న్యాయవాదులను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో పోలీసులను మొహరిచడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడంతో నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కోర్టు ఎదుట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో.. తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement