ఐడీ కార్డు ఉంటేనే కోర్టులోకి అనుమతి | Section 144 in rangareddy district court premises | Sakshi
Sakshi News home page

ఐడీ కార్డు ఉంటేనే కోర్టులోకి అనుమతి

Published Mon, Mar 2 2015 11:11 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

Section 144 in rangareddy district court premises

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  కోర్టు ముందు 144 సెక్షన్ అమలు అవుతోంది. ఐడీ కార్డులు ఉన్నవారినే కోర్టులోనికి అనుమతి ఇస్తున్నారు.  రెండు రోజుల క్రితం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయలంటూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లాయర్లపై దాడి చేశారు. దాంతో కోర్టు పరిసరాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

మరోవైపు చార్మినార్ సిటీ సివిల్ కోర్టు వద్ద కూడా పోలీసులు మోహరించారు.  మేజిస్ట్రేట్ను అడ్డుకుంటారనే సమాచారంతో ముందస్తు భద్రతను పెంచారు. ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే కోర్టులోకి అనుమతించాలని సూచనలను పోలీసులు అమలు చేస్తున్నారు. కాగా జంటనగరాల కమిషనరేట్ల పరిధిలో భద్రతను పెంచినట్లు సీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement